నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటివరకూ వారి కలయికలో వచ్చిన అన్నీ సినిమాలు బాక్సాఫీసు సూపర్ హిట్లు. ఇప్పుడు ‘అఖండ 2’తో రాబోతున్నారు. ఇప్పటికే టీజర్స్ అంచనాలు పెంచాయి. ఈ రోజు ముంబైలో జరిగిన ఈవెంట్లో తాండవం సాంగ్ రిలీజ్ చేశారు
బాలయ్యకు హై-వోల్టేజ్ సౌండ్స్ ఇచ్చే ఎస్ థమన్ మరోసారి అదే స్థాయిలో ఈ పాట చేశాడు. బాలకృష్ణ అఘోర అవతారంలో శివతాండం ఆడే సన్నివేశాలకు థమన్ ఇచ్చిన స్కోర్ ట్యూన్ ఒక డివైన్ ఫీలింగ్ తీసుకొచ్చింది. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఈ పాటకు పవర్ ఫుల్ వోకల్స్ ఇచ్చారు.
రంగ రంగ శంభు లింగ ఈశ్వర
అంతరంగా హే భుజంగా శంకర
నీలకంఠ నిర్మలాంగా ఈశ్వర
కుంభమేళా సంభవ శుభంకర..
లిరిసిస్ట్ కల్యాణ్ చక్రవర్తి శివుని మహత్తుని ఇలాంటి శక్తివంతమైన పదాల్లో పలికించారు. టైటిల్ కి తగ్గట్టు ఈ పాటలో బాలయ్య తాండవం కనిపించింది. సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కి మంచి ఆరంభాన్ని ఇచ్చింది.

