హిందూపురంపై బాల‌య్య మౌనం ఎందుకో.?

గ‌మ‌నించారో లేదో.. గ‌డచిన కొన్ని నెల‌లుగా హిందూపురం ఎమ్మెల్యే, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు వియ్యంకుడు, ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ కాస్త ముభావంగా ఉంటున్నారు! రాజ‌కీయంగా ఆయ‌న పనితీరులో మునుప‌టి చురుకుద‌నం త‌గ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది. హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌రువాత పొలిటిక‌ల్ గా చాలా యాక్టివ్ గా క‌నిపించేవారు. క‌నీసం నెల‌కొసారైనా త‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేవారు. ఓసారి ఎమ్మెల్యేల ప‌నితీరు ర్యాంకింగ్స్‌ లో టాప‌ర్ గా కూడా నిలిచారు. ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌నలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు అంటూ త‌ర‌చూ హడావుడి చేసేవారు. కానీ, ఇప్పుడా జోష్ కాస్త త‌గ్గింద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. అంతేకాదు, విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నా కూడా బాల‌య్య స్పందించని తీరుపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

బాల‌య్య పీయే శేఖ‌ర్ వ్య‌వ‌హారం ఆ మ‌ధ్య ఎంత ర‌చ్చగా మారిందో చూశాం. నియోజ‌కవ‌ర్గంలో ఆయ‌న ఆగ‌డాలు ఎక్కువౌతున్నాయ‌నీ, స్థానిక టీడీపీ నేత‌ల్ని కూడా శేఖ‌ర్‌ కేర్ చేయ‌డం లేద‌నీ.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆయ‌న్ని త‌ప్పించారు. అయితే, రాజ‌కీయంగా బాలయ్య జోష్ ను త‌గ్గించ‌డం కోస‌మే శేఖ‌ర్ ను వ్యూహాత్మ‌కంగా త‌ప్పించార‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. అప్ప‌ట్నుంచే బాల‌య్య కాస్త హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు! ప్ర‌స్తుతం హిందూపురంలో విప‌క్షాల నిర‌స‌న‌లు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే బాల‌కృష్ణ క‌న‌బ‌డుటలేదంటూ గాడిద‌ల‌పై ఊరేగింపు చేప‌ట్టారు. అంతేకాదు, ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే… ఈ ప‌రిణామాల‌పై బాల‌య్య స్పందించ‌క‌పోవ‌డం! విప‌క్షాలు ఈ రేంజిలో విమ‌ర్శిస్తుంటే క‌నీసం ఖండిస్తున్న‌ట్టుగానైనా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం.

ఇంకోప‌క్క, సోష‌ల్ మీడియాలో మ‌రో చ‌ర్చ ఊపందుకుంటోంది! బాల‌య్య త్వ‌ర‌లోనే రాజ‌కీయాల నుంచీ త‌ప్పుకోబోతున్నార‌నీ, అందుకే హిందూపురం గురించి గ‌తంలో మాదిరిగా ప‌ట్టించుకోవ‌డం మానేశారంటూ ఇష్టానుసారం అభిప్రాయ‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై కూడా బాల‌య్య స్పందించ‌డం లేదు. బాల‌య్య రాజ‌కీయంగా కాస్త స్తబ్దుగా మార‌డం వెన‌క వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనేదే ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌. నిజంగానే బాల‌య్య‌లో అసంతృప్తి మొద‌లైందా..? త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఎవ‌రో బ్రేకులు వేస్తున్న‌ట్టు అనుమానిస్తున్నారా..? స‌్థానిక ప‌రిణామాల‌పై స్పందించ‌క‌పోవ‌డం వెన‌క వేరే వ్య‌క్తిగ‌త కార‌ణాలు ఉన్నాయా.. ఇలాంటి ఎన్నో అనుమానాల‌కు ఇప్పుడు రెక్క‌లొస్తున్నాయి. ఈ ప‌రిణామాలపై బాల‌య్య స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి ఇలాంటి ఒక చ‌ర్చ ప్ర‌జ‌ల్లో మొద‌లైంద‌న్న విష‌యం బాలయ్య‌కు తెలుసో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close