ప్రజలు కష్టాలు పడితే ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందని.. అందుకే తన పని ప్రజల్ని హింసించడమేనని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. ఆయన తన దృష్టిని రైతుల మీద పెట్టారు. ఇష్టం వచ్చినట్లుగా రైతుల పంటలపై తప్పుడు ప్రచారం చేస్తూ ధరలు పడిపోయేలా చేయాలనుకుంటున్నారు. ఆయన తీరుతో రైతులు కూడా మండిపడుతున్నారు. మొదట మామిడి, తర్వాత టమాట..ఇప్పుడు అరటి పంటలపై అలాగే ప్రచారం చేస్తున్నారు. కావాలని ధర లేదని ప్రచారం చేయడం వల్ల వ్యాపారులు కూడా వెనక్కి తగ్గుతున్నారు.
వాణిజ్య పంటల రైతులపైనే బగన్ రెడ్డి పంజా
మార్కెట్ లో కి పంట వచ్చే సమయంలో ధరలు కాస్త తగ్గుతూ ఉంటాయి. అది సహజం. డిమాండ్, సప్లయ్ సిద్ధాంతం ప్రకారం చూసినా తప్పదు. అందుకే రైతులు.. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. జగన్ రెడ్డి దీన్నే ఆసరాగా చేసుకుని రైతుల్ని నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో.. ధరలు తగ్గిపోయాయనని తన మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా ఇంకా ఇంకా తగ్గించాలని సిండికేట్ గా మారి కొనుగోళ్లు ఆపేస్తున్నారు. మొత్తం కుట్రపూరితంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు.
అరటి రైతులకు కడపలోనే ఎందుకు డిమాండ్ లేదు ?
అరటిపళ్ల రేట్లు కేజీకి అర్థరూపాయి అయిందని జగన్ రెడ్డి ఇంగ్లిష్ లో ట్వీట్ పెట్టారు. ఆయన దేశాన్ని మోసం చేయాలనుకున్నారు. ఆయన పెట్టిన ట్వీట్ చేసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. కేజీ అర్థరూపాయికి అమ్ముకుంటున్నామా అని. దానికి ఆధారాలు లేవు. ఆయన తమ పార్టీ కార్యకర్తలు ఫ్రెష్‌గా కొనుగోలు చేసిన నాలుగు అరటి గెలల్ని పట్టుకుని ఆ ప్రదర్శన చేశారు. ఇప్పుడు మార్కెట్ లో డజన్ అరటి పళ్లు కనీసం వంద చెబుతున్నారు. గతంలో 70 రూపాయలు ఉండేది. అంటే రేట్లు పెరిగాయి. రీటైల్ లో పెరిగినప్పుడు రైతుల వద్ద ధరలు ఎందుకు తగ్గుతాయి?. తగ్గాయంటే ఏదో మాఫియా కుట్ర చేసినట్లే అర్థం అవుతుంది.
జగన్ మీడియా, సోషల్ మీడియాతోనే రైతులు గండం
రాజకీయాలను రాజకీయంగా చేయాలి. కానీ రైతుల్ని ముంచేస్తే వారు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకుంటారని తమ వద్ద ఉన్న మీడియా, సోషల్ మీడియా సాయంతో ధరలు పడిపోయాయని ప్రచారం చేసి.. అసలు కొనేవాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారు. వ్యాపారుల్ని సిండికేట్ చేసి.. రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. కేవలం రాయలసీమలో అదీ కడపలో పండే పంటలకే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో.. ఆలోచించాల్సి ఉంది. వీరి కుట్రల్ని ప్రభుత్వమే బద్దలు చేసి.. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంది.
