ఎర్రి డాష్ అనిపించుకున్నా : బండ్ల గ‌ణేష్‌

గ‌త ఎన్నిక‌ల ముందు బండ్ల గ‌ణేష్ బోలెడంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచాడు. టీఆర్ఎస్‌ని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌క‌పోతే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా – అంటూ భీక‌ర‌మైన ప్ర‌తిజ్ఞ‌లు చేశాడు. అయితే ఆ ప్ర‌తిజ్హ‌లేం నెర‌వేలేదు. కానీ.. 7 ఓ క్లాక్ బ్లేడు మేట‌రైతే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. చాలా కాలం త‌ర‌వాత బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ క‌నిపించాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ఈ సినిమాలో బండ్ల‌గ‌ణేష్ ఓ పాత్ర పోషించాడు. షాద్ న‌గ‌ర్‌లోని కోళ్ల ఫార‌మ్‌లో గుడ్లు ఏరుకుంటుంటే.. త‌న‌కు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చార‌ని, అప్ప‌ట్లో రాజ‌కీయాలూ – సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడూ అంటూ రూటు మార్చాన‌ని, తానో `ఎర్రి డాష్‌` అనిపించుకున్నాన‌ని, అయితే ఇప్పుడు బుద్ధిగా సినిమాలు చేసుకుంటాన‌ని, సినిమాల్లోనే ఉంటాన‌ని ప్ర‌తిజ్ఞ చేశాడు. బండ్ల‌గ‌ణేష్ స్టేజీమీద ఉన్న ఆ కాసేపూ…. ఆడియ‌న్స్ నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. గ‌ణేష్ మాట‌ల‌కు అంతా `ఊ` కొట్టారు కూడా. సో… గ‌ణేష్ దృష్టంతా ఇప్పుడు సినిమాల‌పైనే అన్న‌మాట‌. మ‌రి ప‌నిలో ప‌నిగా ప్రొడ‌క్ష‌న్ కూడా చేసేస్తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిజెపి జనసేన పొత్తు విచ్ఛిన్న యత్నం? జీవీఎల్ కూడా వైకాపా మనిషేనా?

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక వర్గం మనిషి గా బయటికి మెలుగుతూ, అంతర్గతంగా వేరే వర్గానికి మద్దతు ఇచ్చే పాత్రలను అప్పుడప్పుడు చూస్తూవుంటాం. అయితే నిజ జీవితంలోని రాజకీయాలలో, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా...

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

HOT NEWS

[X] Close
[X] Close