ఫృధ్వీకి కూడా అమరావతి రైతులంటే చులకనే..!

పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదానికి పర్‌ఫెక్ట్ సాక్ష్యం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ. ఎందుకంటే.. ఆయన డబ్బులు తీసుకుని నటిస్తూంటారు. రాజకీయాల్లోనూ.. అలా చేశారో లేదో కానీ.. సినిమాల్లో మాత్రం ఆయన పెయిడ్ ఆర్టిస్ట్. అలా తన వృత్తిని గౌరవించుకోవాల్సిన ఆయన… రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ ఈసడించేశారు. అక్కడెవరూ రైతులు లేరని.. అంతా పెయిడ్ ఆర్టిస్టులేనని.. ఇతర వైసీపీ నేతల్లా.. తాను కూడా..వారిపై ఓ రాయి వేశారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తూండటంపై వైసీపీ నేతలు ఒక్కరూ సానుభూతి చూపకపోగా.. వారిని నానా రకాలుగా మానసిక క్షోభకు గురి చేసే విధంగా మాట్లాడుతూ.. వారి ఆగ్రహానికి గురవుతున్నారు.

భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని.. నిజంగా పెయిడ్ ఆర్టిస్టులే హేళన చేయడం.. ఇందులో కొత్త కోణం. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ లాంటి వాళ్లను కూడా.. వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా.. రైతులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి.. రాజధాని అంశానికి సంబంధమే లేదు. ఆయన ఎస్వీబీసీ చానల్ కు చైర్మన్. కానీ.. కావాలనే.. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నది మాత్రం స్పష్టం.

సినిమా ఇండస్ట్రీ… ఆంధ్రప్రదేశ్ సమస్యలపై స్పందించడం లేదనే… విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్న సమయంలో.. ఫృధ్వీ ఇలాంటి.. విమర్శలు చేయడం కూడా కాక రేపే అవకాశం కనిపిస్తోంది. పెద్ద సినిమాను బహిష్కరించాలనే పిలుపును రాజధాని రైతులు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఫృధ్వీ వారిని ఇండస్ట్రీపై మరింతగా రెచ్చగొట్టే కోణంలోనూ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏదైనా.. కానీ రాజధాని రైతుల ఆందోళనను.. అందరూ శక్తివంచన లేకుండా.. తమ తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారన్నది మాత్రం స్పష్టమవుతోది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close