గంటా బీజేపీకి దగ్గరైన కారణం అదన్నమాట..!

ఇటీవలి కాలంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు… భారతీయ జనతాపార్టీ నేతలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. టీడీపీలోని తన పాత మిత్రులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ..ఢిల్లీలో తరచూ కనిపిస్తున్నారు. అమిత్ షా, మోడీ అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నించి.. కలుస్తున్నారు. వైసీపీలో చేరేందుకు ఆఫర్ ఉండగా.. గంటా ఇలా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారా.. అన్న దానికి.. మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష గ్రూప్‌ బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టింది. తనఖా పెట్టిన ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేశాయి ఆ బ్యాంకులు. వేలం ప్రతిపాదనలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉండంగా.. ఇప్పటికిప్పుడు వాటిలో కదలిక కనిపిస్తోంది.

గంటా శ్రీనివాసరావుకు ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి.. దాదాపుగా రూ. 209 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో.. చాలా వరకూ తిరిగి చెల్లించలేదు. అంత రుణానికి.. బ్యాంకుల వద్ద తనాఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 40 కోట్ల లోపే అని.. వేలం వేసే బ్యాంకులు చెబుతున్నాయి. రుణగ్రహితల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ఉన్నారు. బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటీసులకు గంటా ఇంతవరకూ రియాక్ట్ కాలేదు. ఆస్తులను విశాఖలోని ఇండియన్ బ్యాంకు కొంత కాలం కిందటే స్వాధీనం చేసుకుంది. వాటిని వచ్చే నెల ఇరవైన వేలం వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరిపై.. కూడా బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బులు ఎగవేసినట్లుగా ప్రచారం జరిగింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఓ సందర్భంలో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన హైకోర్టుకు వెళ్లి ఎలాగోలా అరెస్ట్ కాకుండా… విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత అంతా.. సైలెంటయిపోయింది. ఇప్పుడు గంటా కూడా… అలాంటి అడ్వాంటేజ్ కోసమే.. బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close