చైతన్య: జూనియర్‌ని ప్లాన్డ్‌గా తొక్కేస్తున్న ఫ్రెండ్స్..!

మొన్న కొడాలి నాని.. నిన్న నార్నె శ్రీనివాసరావు.. నేడు వల్లభనేని వంశీ.. వీరందరూ.. వైసీపీ గూటికి చేరడంలో ఓ లెక్క పక్కాగా కనిపిస్తోంది. కొద్దిగా అటూ ఇటూ అయినా.. వారి వారి వ్యక్తిగత అవసరాలే లక్ష్యంగా అయినా.. వీరందర్నీ.. ప్లాన్డ్‌గా టీడీపీకి దూరం చేసి.. ఆనక వైసీపీ గూటిలో చేర్చడం వెనుక జగన్ భవిష్యత్ వ్యూహాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తనకు పోటీ రాకుండా.. ఆయన తన గుప్పిట్లో ఉన్నారని చెప్పుకోవడానికి.. ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా రాజకీయంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. వీరు కూడా.. జగన్ చెప్పినట్లుగా.. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లాగి… ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారు.

జూనియర్ సన్నిహితులంతా టీడీపీకి ఎందుకు గుడ్ బై..!

కొడాలి నాని, వల్లభనేని వశీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను సీన్‌లోకి తీసుకొచ్చారు. ఆయనను టీడీపీలో పక్కన పెట్టారని.. అదని.. ఇదని వాదిస్తున్నారు. జూనియర్ 2009 ఎన్నికల కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలకే పరిమితమయ్యారు. ఇంత కాలం.. మాట్లాడని వారు.. ఇప్పుడు.. బయటకు వెళ్తూ.. జూనియర్ ఎన్టీఆర్‌ను పొగుడుతున్నారు. చంద్రబాబును తిడుతున్నారు. ఇక్కడే తేడా కొడుతోంది. కొడాలి నానికి పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలయినప్పుడు… అదే మాట చెప్పి వెళ్లారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అదే చెప్పి వెళ్తున్నారు. పదేళ్ల పాటు పార్టీలో ఉండి.. జూనియర్ కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఒక్క మాట కూడా మాట్లాడని.. వంశీ.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత… ఎందుకు.. జూనియర్ ప్రస్తావన తెస్తున్నారనేది ఆసక్తికరం.

ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారు..?

కొడాలి నాని, వంశీలకు జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడనే ప్రచారం ఉంది. వీరు బయటకు వెళ్లి.. వైసీపీలో ఉండి.. జూనియర్ ఎన్టీఆర్ ను పదే పదే రాజకీయంగా ప్రస్తావనకు తీసుకు రావడం వల్ల ఎవరికి లాభం..? వారికి తాత్కలికంగా లాభం కలుగుతుందేమో కానీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు కాదు. వీరి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని.. ఆయనే వైసీపీలోకి పంపుతున్నారన్న ప్రచారం .. ఇప్పటికే జరుగుతోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్‌కే ఇబ్బంది. ఆయన ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. కానీ.. టీడీపీ ఫ్యూచర్‌లో ఆయనకూ పాత్ర ఉంటుందనే నమ్మకాలున్నాయి. ఇప్పుడు ఆయన స్నేహితులతో.. ఆయనకు ఆ అవకాశం లేకుండా చేసేశారు జగన్.

టీడీపీకి ఎన్టీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించి.. అన్నా..అన్నా అనిపించుకుంటారా..?

రేపు జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే.. ఆయనపై కచ్చితంగా వైసీపీ ముద్ర ఉంటుంది. కొడాలి నాని టీడీపీకి కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించి.. అన్నా.. అన్నా.. అని తమ వెంట తిప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. ఈ ఉద్దేశం.. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించిందేనని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ .. కొడాలి నానిని అన్నా.. అన్నా అని.. పిలుస్తూ తిరుగుతూంటారు. దీన్నే గుర్తు చేసేలా.. కొడాలి నాని అలా వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూసినా.. ఎన్టీఆర్ స్నేహితులతో.. ఆయనను తన మనిషిగానే జగన్ మార్చుకునే ప్రయత్నంలో అడుగులు ముందుకు పడినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియా కాల్ లిస్ట్‌లో రకుల్, రానా ..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి కాల్ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. కాల్ లిస్ట్‌ను బయటకు...

నన్ను సస్పెండ్ చేయండి ప్లీజ్: జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ " నేను మొదటి నుండి వైఎస్ఆర్సిపి మనిషినే" అని నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందే తాను వైఎస్ఆర్సిపి టికెట్ కోసం...

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

HOT NEWS

[X] Close
[X] Close