ఇసుకపై ప్రభుత్వ పేపర్ ప్రకటనలకు సంతృప్తి చెందిన జనసేనాని..!

ఇసుక కొరత పరిష్కరించామని.. కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని…ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి.. అన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చింది. దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది. దీనికే.. ఇసుక కొరతపై ప్రభుత్వ విధానంపై పోరాటం అంటూ.. లాంగ్ మార్చ్ చేసి.. స్ట్రాంగ్ వార్నింగులు ఇచ్చిన జనసేనానికి దీనికి శాటిస్‌ఫై అయిపోయారు. విశాఖ లాంగ్ మార్చ్‌లో తన రెండు వారాల డెడ్ లైన్ ముగిసేలోపు ప్రభుత్వం స్పందించిందన్నట్లుగా.. ఇది తన ఘనతేనని చెప్పుకుంటూ.. ఓ ట్వీట్ చేసి.. అప్పటికి ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసిందన్నట్లుగా… జనసైనికులు అక్రమాలు జరగకుండా.. ఓ కన్నేసి ఉంచాలన్నట్లుగా సందేశం ఇచ్చారు. సుదీర్ఘ పోరాటాలు.. ఆరు నెలల తర్వాత ఇసుక అయితే.. కొంత మేర అందబాటులోకి వచ్చింది. కానీ స్టాక్ పాయింట్లన్నీ వైసీపీ నేతల గుప్పిట్లో ఉన్నాయి.

ధర ఏ మాత్రం తగ్గలేదని..గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే జనసేనాని మాత్రం.. సమస్య పరిష్కారం అయిపోయిందనుకుంటున్నారు. నిజానికి విశాఖలో లాంగ్ మార్చే చేసి.. రెండు వారాలపాటు డెడ్ లైన్ పెట్టిన డిమాండ్లలో.. ఇసుక కొరత తీర్చడం మాత్రమే కాదు.. ఉపాధి కోల్పోయిన కూలీలకు పరిహారం.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సాయం చేయడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోయినా..జనసేనాని మాత్రం.. లైట్ తీసుకున్నారు. ఇసుక కొరత విషయంలో ఏపీ సర్కార్.. అంత ఖర్చు పెట్టి ప్రకటనలు ఎందుకివ్వాల్సి వచ్చిందో.. చాలా మందికి అర్థం కావడం లేదు.. అలాగే ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా.. అవసరం లేదంటున్నారు.

ఆర్టీజీఎస్ రూపంలో ఇప్పటికే ఓ వ్యవస్థ ఉంది. దానికి అందరూ ఫిర్యాదులు చేయవచ్చు. కానీ సమస్యను గుర్తించామని.. చెప్పుకోవడానికన్నట్లే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ధరల నియంత్రణ విషయంలో మాత్రం.. చట్టం చేశామని.. జైలు శిక్ష అని.. మరొకటని ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు జరిగేదే అక్రమం..బిల్లుల్లాంటివి ఏమీ లేకుండా జరుగుతుంది. అలాంటప్పుడు.. శిక్షలు.. కేసులు అనే ప్రస్తావన రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close