భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తూ… తిరుమలపై నమ్మకం తగ్గించేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తున్న నేను అలా అనలేదు.. ఇలా అన్నాను అంటూ పోలీసులకు విచిత్రమైన ఉదాహరణలు ఇస్తున్నారు. టీటీడీ గోశాలలో గోవులను వధిస్తున్నారని తప్పుడు ప్రచారం చేసిన ఆయన.. ఇప్పుడు తాను వధించారని అనలేదని.. గోవుల వధ అనలేదని.. గోవుల వ్యథ అని మాత్రమే అన్నానని తనకు తెలిసిన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించారు.
భూమన కరుణాకర్ రెడ్డి .. ఆయన తమ్ముడు.. తెలుగు పండితులే కానీ ఇలా ప్రజల్ని, పోలీసుల్ని పిచ్చి వాళ్లను చేయడానికి .. టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ఆ పాండిత్యాన్ని ఉపయోగించడం మాత్రం క్షమించరాని నేరంగా మారింది. టీటీడీ గోశాలపై తప్పుడు ప్రచారం చేసి దాన్ని సాక్షిలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రసారం చేయించడమే కాకుండా.. తాను వధ అనలేదని.. వ్యథ అన్నానని పోలీసులకు వివరణ ఇచ్చారు.
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన .. తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. కానీ తాను గో వధ అని చెప్పలేదని.. గో వ్యధ అని మాత్రమే చెప్పానని మీడియాకు చెప్పలేదు. అంటే ఆయన ఎంత కుట్ర పూరితంగా టీటీడీపై తప్పుడు ప్రచారం చేయాలని అనుకున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడిపై ఏ మాత్రం నమ్కకం లేని భూమన లాంటి వాళ్లకు.. చట్టపరంగాసరైన శిక్ష పడాల్సిందేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.