తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని CBI-SIT దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 2019-2024 మధ్య కాలంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించి, రూ. 250 కోట్ల విలువైన సింథటిక్ నెయ్యిని సరఫరా చేయడానికి అప్పటి ప్రభుత్వం సహకరించిందని SIT పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే తమకు క్లీన్ చిట్ లభించిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇంగ్లీష్ మీడియా, జాతీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
జగన్ చేసింది హిందూధర్మంపై దాడి
అనిమల్ ఫ్యాట్ లేదని తేలిందని జగన్ వాదిస్తుంటే, సింథటిక్ కెమికల్స్ వాడి శ్రీవారి ప్రసాద పవిత్రతను భ్రష్టు పట్టించడం అంతకంటే పెద్ద నేరమని మీడియా తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రధానంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్లలో జరిగిన చర్చల్లో వైసీపీ ప్రతినిధుల తీరు మరింత వివాదానికి దారితీసింది. చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్తీక్ వంటి ప్రతినిధులు, జగన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ను సమర్థించుకునే ప్రయత్నం చేయడంపై జాతీయ మీడియా మండిపడింది. నమ్మకం లేని వ్యక్తి పవిత్ర క్షేత్రంపై నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి అపచారాలు జరిగాయి అనే కోణంలో విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీబీఐ నివేదికలో 36 మందిపై అభియోగాలుఉన్నప్పటికీ, జగన్ మాత్రం తనకు సంబంధం లేదని సెల్ఫ్-క్లీన్ చిట్ ఇచ్చుకోవడంపై యాంకర్లు ఆయనను రోస్ట్ చేస్తున్నారు.
దేశం మొత్తం జగన్ తీరుపై చర్చ
సోషల్ మీడియాలో కూడా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆయన వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. గతం నుంచి ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలను గుర్తు చేస్తూ.. లడ్డూ కల్తీ వ్యవహారం జగన్ హయాంలోని అరాచక పాలన కు పరాకాష్ట అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇంకా అబద్ధాలతో బుకాయించాలని చూస్తే, జాతీయ స్థాయిలో ఆయన ఒక విలన్ గా ముద్రపడే ప్రమాదం కనిపిస్తోంది.
క్షమాపణ చెప్పాలని ఇంగ్లిష్ మీడియా డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణలో మరిన్ని లోతైన విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి కఠిన శిక్ష పడాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన వైఖరి మార్చుకుని తప్పు ఒప్పుకోవాలని, లేదంటే జాతీయ స్థాయిలో ఎదురయ్యే వ్యతిరేకత ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత క్లిష్టతరం చేస్తుందని మీడియా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని అంటున్నాయి. కానీ జగన్ కావాలంటే.. ఆ చానళ్లపై దాడులు చేయిస్తారు కానీ.. క్షమాపణలు చెప్పరు.
