జగన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు, పరిశ్రమల్ని తరిమేస్తామని, భూముల్ని లాగేసుకుంటామని చేసే ఘోరమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చే టీవీ9, ఎన్టీవీ ఒక్కసారి అంటే ఒక్క సారి అయినా జగన్ రెడ్డి చేసే తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశాయా?. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏమిటని ఒక్క సారి అయినా ప్రశ్నించాయా ?.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఆయా చానళ్ల యాజమాన్యాలకు ఎంత లావును దోచిపెట్టారో కానీ ఇంకా భజన ఆపడం లేదు. ప్రజాస్వామ్యంలో అత్యంత ఘోరమైన పనులు చేస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నించాడనికి ముందుకు రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీకి వెళ్లని జగన్ రెడ్డికి.. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారని ఎందుకు నిలదీయరు?. ఓట్లేసిన ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎందుకు అడగరు ?
కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య చిచ్చులు పెట్టడానికి పెద్ద పెద్ద కథలు రాస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ చానళ్లలో ఉన్నత స్థానాల్లో పని చేసే ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని మెప్పించడానికి బహిరంగంగానే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై, ఉపముఖ్యమంత్రిపై సెటైర్లు వేస్తూంటారు. కానీ జగన్ రెడ్డి చేస్తోంది తప్పు అని మాత్రం ఒక్కరూ చెప్పరు. అత్యంత ఘోరమైన మనస్థత్వం, అవినీతిరపరుడు, ప్రజల పట్ల కనీస బాధ్యత లేని వ్యక్తిని ఈ చానళ్లు ఎలా సమర్థిస్తాయో కానీ .. మీడియా పేరుతో వీరు చేసేది మాత్రం ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకరం.