బీహార్లో ఆలూ ఉన్నంత కాలం లాలూ ఉంటాడని గతంలో తన హవా బీభత్సంగా సాగుతున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనేవారు. ఇప్పుడు ఆయన హవా తగ్గిపోయినా ..అనారోగ్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తన హవా మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. బీహార్ లో కాంగ్రెస్ ను చాలా సింపుల్ గా దారిలోకి తెచ్చారు.
కాంగ్రెస్, ఆర్జేడీ,కమ్యూనిస్టులతో పాటు వీఐపీ అనే మరో పార్టీతో కలిసి ఇండీ కూటమి ఉంది. ఈ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ను ప్రకటించాలని అనుకున్నారు.కానీ కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారు. అలా ఎలాప్రకటిస్తారని బెట్టు చేశారు. మాకు భారీగా సీట్లు కావాలని పట్టుబట్టారు. కానీ లాలూ యాదవ్ చాలా సింపుల్ గా డీల్ చేశారు. ఎంతలా అంటే.. వెంటనే బీహార్ కు అశోక్ గెహ్లాట్ ను పంపించారు. సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ను ప్రకటింపచేశారు. ఉపముఖ్యమంత్రిగా వీఐపీ పార్టీ నేతను ప్రకటించారు. అంటే కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎం కూడా లేదన్నమాట.
రెండో డిప్యూటీ సీఎం ఉంటుందని అది కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని గెహ్లాట్ కవర్ చేసుకున్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం తమ సీట్లను తాము ప్రకటించుకుని.. తమ అభ్యర్థుల్ని కూడా ఆర్జేడీ ఇతర పార్టీలు ప్రకటించుకుని నామినేషన్లు వేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తే అందులో నామినేషన్లు వేయాల్సి వచ్చింది. ఐదారు చోట్ల కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ సభ్యులు కూడా పోటీ పడుతున్నారు.