సోమవారం మండలి రద్దు తీర్మానం..!?

సోమవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని .. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న అధికార పార్టీ.. మండలి అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది. అసెంబ్లీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ మంత్రులు అయిన మోపిదేవి, పిల్లి సుభాష్ కూడా.. మండలి అవసరం లేదన్నారు. చివరికి.. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. అప్పుడే.. శాసనమండలిని రద్దు చేస్తూ.. తీర్మానం చేస్తారని అనుకున్నారు. కానీ.. సోమవారం మరింతగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు. తీర్మానం చేయడానికి ముందు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి..అందు కోసం వాయిదా వేశారని భావిస్తున్నారు. అలా కాదు.. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా.. ఒత్తిడి చేయడానికే.. ఇలా చేశారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది.

మూడు రాజధానుల బిల్లుపై.. ముందుకెళ్లాలంటే… మండలిని రద్దు చేయడం తప్ప.. మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటికీ పంపడంతో.. ఆ బిల్లులు ఇక పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులను.. శాసనమండలి.. ఎప్పుడు తిరిగి పంపిస్తుందన్నదానిపైనా క్లారిటీ లేదు. సెలక్ట్ కమిటీ ప్రక్రియ ప్రారంభమైతే.. కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత ఎంత సమయం తీసుకుంటారన్నదానిపై ఆంక్షలు లేవు. యనమల రామకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం.. ఎంత కాలం అయినా బిల్లు తిప్పి పంపకుండా… సెలక్ట్ కమిటీ అభిప్రాయాలు సేకరింవచ్చు. రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాలు తీసుకోవచ్చని.. యనమల చెప్పడంతో.. ఆ బిల్లు అంత సామాన్యంగా తిరిగి రాదని వైసీపీ నేతలకూ ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇరుక్కుపోయిన … అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు విముక్తి కల్పించాలంటే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గంమని… అధికార పార్టీ నేతలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అన్ని వైపుల నుంచి కార్నర్ అయిపోయిందని స్పష్టం అయిపోయింది. మండలిని ఉన్నపళంగా రద్దు చేస్తే తప్ప.. ఇక రాజధాని నిర్ణయాన్ని కదిలించడం అసాధ్యం. మండలిని రద్దు చేయాలంటే.. ఏడాది పడుతుందని చెబుతున్నారు. తీర్మానం చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వ పరిధి. ఉభయసభలు ఆమోదించాలి. రాష్ట్రపతి సంతకం పెట్టాలి. కానీ కేంద్రంతో మాట్లాడి.. బడ్జెట్ సమావేశాల్లోనే .. మండలి రద్దును ఉభయసభల్లో ఆమోదింపచేస్తే.. త్వరగానే అయిపోతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనాకు వచ్చారు. అలా కాదు.. మండలిని రద్దు చేస్తామన్న హెచ్చరికలతో.. మళ్లీ మండలి దారికి వచ్చి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే.. ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close