టీటీడీ పాలకమండలిని రద్దు చేయకపోతే కోర్టుకు బీజేపీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరిచిన తీరుపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 36 మంది సభ్యులను నియమించడంపై కోర్టుకెళ్లేందుకు సిద్ధమని… బీజేపీ ప్రకటించింది. టీటీడీని ధర్మసత్రంగా మార్చేశారని.. ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. 36 మంది పాలక మండలి సభ్యులు… కుటుంబసభ్యులతో సహా వస్తే… ప్రమాణ స్వీకార మండపం అయిన వాహన మండపం సరిపోదని… టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ గురంచి… జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 36 మంది సభ్యులను నియమించడం ఎంత వరకు సమంజసమని .. టీటీడీ చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్డును నియమించారని మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి ఆలయం ఏమైనా జగన్‌ సొంత ఆలయమా?.. ప్రజల ఆలయమా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి ఉందన్నారు. తాము రాజకీయంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. పాలక మండలికి సంబంధించిన మూడు జీవోలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులకే జగన్ ప్రభుత్వం విమర్శల ఎదుర్కొంటోందని.. ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్‌ అనుకుంటున్నారని భానుప్రకాష్ రెడ్డి మండిపడుతున్నారు.

నిజానికి … టీటీడీ పాలక మండలి వ్యవహారం.. చట్ట విరుద్ధంగా ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లోనే ఉంది. బీజేపీకోర్టుకు వెళ్తామని ప్రకటించడంతో.. ఈ వివాదం కీలక మలుపులు తిరుగుతాయన్న అంచనా రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదన్న బాలకృష్ణ, విమర్శించిన మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ లో 151 ఎమ్మెల్యే ల మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని, అంతకంటే ముందే ఈ ప్రభుత్వం దిగి పోతుందని నందమూరి బాలకృష్ణ...

బాలకృష్ణని ఎవరూ అవమానించలేదు: సి.కళ్యాణ్

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలి సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు చేసిన...

ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని...

నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

[X] Close
[X] Close