పోలవరం ఎత్తు తగ్గింపు ఎజెండా ఖరారు..!?

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయం తీసుకోవడానికే 24వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నాయి. గత సోమవారం అసెంబ్లీలో… కేసీఆర్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే… ప్రస్తుతం సమావేశం నిర్ణయం అయిందని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే అంశాన్ని గుర్తు చేసి.. పోలవరం ప్రాజెక్టు జోలికెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. గత సోమవారం అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ .. కీలకమైన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్లే… తెలంగాణ, ఒడిషాతో సమస్యలు ఉన్నాయని.. ఎత్తు తగ్గిస్తే… అన్నీ సమసిపోతాయని.. చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను జగన్ తో మాట్లాడానని… ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించారని కూడా.. కేసీఆర్ ప్రకటించారు.

ఈ క్రమంలో జగన్ కూడా.. దానికి 24వ తేదీన సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఉందేమో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు… మీడియా సమావేశం పెట్టి … సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టును విధ్వంసక చర్యల్లో భాగంగానే నిలిపివేశారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని … ఏపీ పరిస్థితులు ఏం తెలుసని కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారుని ప్రశ్నించారు. శ్రీశైలం ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని .. గోదావరి – పెన్నా అనుసంధానం చేస్తే..చాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దుని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్ట్ భద్రతతో… ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలవరం ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్టని .. 55లక్షల క్యూసెక్కుల నీటిని దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారని గుర్తు చేశారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం మిగలదున్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు వేసుకునే వ్యక్తి చెప్పినట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బోటు మునిగిపోతే ఇంత వరకు చెప్పలేని వాళ్లు… పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 24న పోలవరం ఎత్తు తగ్గించి… ఉమ్మడి ప్రాజెక్ట్ కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటారని తెలంగాణ అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close