ప్రొ.నాగేశ్వర్: జమ్మూకశ్మీర్‌తో బీజేపీ రాజకీయ ఆటలు..!

జమ్మూకశ్మీర్‌లో పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్ పీడీపికి బీజేపీ కటీఫ్ చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. దీంతో కశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమయింది. అసలు పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరమే కాదు.. అభ్యంతరకరం కూడా. 2016లో కశ్మీర్‌లో ఎన్నికలు జరిగినప్పుడు…370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ 370 ఆర్టికల్ వల్ల కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి వస్తుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి వద్దని బీజేపీ ప్రచారం చేసింది. ఇలా చేసి జమ్మూలో ఉన్న హిందువుల ఓట్లను పొందింది. ఎక్కువ అసెంబ్లీ సీట్లను తెచ్చుకోగలిగింది. కశ్మీర్‌కు మరింత అధిక స్వయంప్రతిపత్తి కావాలని పీడీపీ తన రాజకీయ విధానాన్ని ప్రకటించింది. ఆర్టికల్ 370ని మరింత పటిష్టం చేయాలన్నది పీడీపీ ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ వల్ల ముస్లింలు ఎక్కువ ఉన్న కశ్మీర్‌లో పీడీపీ ఎక్కువ సీట్లను తెచ్చుకోగలిగింది. రెండు పరస్పర విరుద్ధ విధానాలతో ఎన్నికలకు వెళ్లిన ఈ రెండు పార్టీలు.. పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

కశ్మీర్ ప్రజల సెంటిమెంట్ “ఆర్టికల్ 370”
ఆర్టికల్ 370 అనేది కశ్మీర్ సమస్యకు మూలం. కొన్ని చారిత్రక పరిస్థితుల్లో జమ్మకశ్మీర్ భారత్‌లో విలీనం అయింది. ఆ సమయంలో కశ్మీర్ ప్రజలు కోరుకుంటే.. పాకిస్థాన్‌లో అయినా కలసి ఉండేవారు. లేదా స్వతంత్ర దేశంగా అయినా ఏర్పడగలిగేవారు. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి కూడా భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అలాంటి పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు భారత యూనియన్‌లో భాగం కావాలని నిర్ణయించారు. అందుకుగాను.. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ఓ హామీ ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో విలీనం అవుతున్నారు కాబట్టి… స్వయం ప్రతిపత్తి ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు. ఈ ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేస్తూ .. జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో.. భారత ప్రభుత్వ పెత్తనం పెరుగుతోందన్న భావన పెరిగిపోయింది. దీన్ని మత చాందసవాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఇదే అండ చూసుకుని పొరుగున ఉన్న పాకిస్థాన్… తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించింది.

మిలటరీతో కశ్మీర్‌ను అదుపులో ఉంచగలమా..?
కశ్మీర్‌ను పూర్తిగా మిలటరీ సాయంతో… అధీనంలో ఉంచుకోగలమా..? వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టి.. కేవలం మిలటరీ సాయంతో భయపెట్టి… జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా ఉంచలేము. అక్కడి ప్రజల మనసుల్ని గెలవకుండా ఇది సాధ్యం కాదు. జమ్మూకశ్మీర్‌ అనేది భారత్‌లో అంతర్భాగం. జమ్మూకశ్మీర్ విలీనాన్ని మార్చడానికి వీల్లేదు. భారత సార్వభౌమాధికారానికి లోబడి.. రాజ్యాంగానికి లోబడి.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇస్తామని చెప్పడం ద్వారానే జమ్మూకశ్మీర్‌ను భారత్ వైపు ఉంచగలం. కానీ దీనికి పూర్తి భిన్నమైన వైఖరి తీసుకుంటున్నారు. బీజేపీ ఆర్టికల్ 370కి వ్యతిరేక వైఖరి తీసుకుంది. పీడీపీ భారత దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వైఖరి తీసుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆశ్చర్యం

కేంద్రం గందరగోళం వల్లే కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి..!
రామ్‌మాధవ్.. జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద హింసాకాండ పెరిగిందని చెప్పారు. మత చాందసవాదం పెరిగింది అని చెప్పుకొచ్చారు. అంటే… మేము, పీడీపీ కలిసి తీవ్రవాద హింసాకాండ, మత చాందసవాదం పెరగడానికి కారణమయ్యామని బహిరంగంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వంలో భాగరస్వామి ఉండి… ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని ఎలా అంటారు..? అసలు పీడీపీతో ఎందుకు కలిశారు..? ఏం సాధిస్తారని కలిశారు..? ఏమీ సాధించకపోవడానికి కారణాలేమిటి..? జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి చూపిస్తామని అధికారం చేపట్టారు. కానీ ఇప్పుడు శాంతి, అభివృద్ధి చేయలేకపోయామని… తీవ్రవాదం, చాందసవాదం పెంచామని… బీజేపీ చెప్పుకుంటోంది. ఓ వైపు తీవ్రవాదులు కాల్పులు జరుపుతూంటే.. కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ హఠాత్తుగా కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ రెండు నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఓ వైపు నరేంద్రమోడీ పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలిసి వస్తారు. మరో వైపు పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగదోసినంత వరకూ చర్చలు ఉండవంటారు. మరోసారి పాకిస్థాన్‌లో చర్చలు జరుపుతామంటారు. ఈ గందరగోళం వల్లే జమ్మూకశ్మీర్‌లో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడతామంటున్నారు.

కశ్మీర్ ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నాలేవి..?
ఓ ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడే శాంతి లేనప్పుడు… గవర్నర్ పాలన పెడితే.. పరిస్థితులు చక్కబడతాయా..?. బీజేపీ కశ్మీర్ ప్రజలకు…రెండు ముఖ్యహామీలు ఇచ్చింది. ఒకటి కశ్మీరీ ప్రజలకు విశ్వాసం కల్పించే చర్యలు చేపడాతమన్నారు. అందరితో చర్చలు జరిపి… ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడేమంటున్నారు… సైనిక సంపత్తితో ఎదుర్కొంటాంటామంటున్నారు. బుల్లెట్లతో దూసుకొచ్చేవారిని తుపాకులతోనే ఎదుర్కోవాలి. అందులో తప్పు లేదు. కానీ ప్రజలందర్నీ తీవ్రవాదులుగా చూడలేరు. అంటే..తీవ్రవాదల నుంచి ప్రజల్ని దూరం చేయాలి. అలా జరగాలంటే.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి. దానికి రాజకీయ పిరష్కారం ముఖ్యం. దీని కోసం ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు.

తప్పంతా పీడీపీపై వేయడమే బీజేపీ ప్లాన్..!
కశ్మీర్‌లో ఇప్పుడు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. రేపు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి బీజేపీ. అందుకే.. ఇప్పుడు తప్పందా పీడీపీపై తోసేసి… బీజేపీ బయటకు వచ్చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మేము అధికారంలో ఉంటేనే.. తీవ్రవాదాన్ని అణచివేయగలమని… ప్రధానమంత్రిగా మోదీ ఉంటేనే…అది సాధ్యమవుతుందని బీజేపీ ప్రచారం ప్రారంభించబోతోంది. బీజేపీ అధికారంలో ఉంటే… ఇలా చెప్పుకోవడం సాధ్యం కాదు. అందుకే.. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.. మిలటరీ కార్యకలాపాలు పెంచి… దేశ ప్రజల ముందు.. తాము గట్టిగా అణచి వేస్తున్నామన్నాని చెప్పుకోనుంది. కానీ పాకిస్థాన్‌ను ఎదుర్కోవాలి.. ఉగ్రవాదాన్ని అణచి వేయడమే.. కశ్మర్ సమస్యకు పరిష్కారం కాదు. ఈ రెండింటితో పాటు… అక్కడి ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి. ఇది జరగాలంటే…ఏ చారిత్రక పరిస్థితుల్లో కలిశామో…ఆ స్వయం ప్రతిపత్తి తమకు ఇవ్వడం లేదనే భావన వారికి ఉంది. తమను ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నానే భావన ఉంది. ఈ డిల్లీ పెత్తనం అంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే చాలా ఆగ్రహం ఉంది. మరి ఓ చారిత్రక పరిస్థితుల్లో దేశంలో కలిసిన జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఇంకెంత ఉండాలి..?

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించడమే పరిష్కారం..!
జమ్మూకశ్మీర్‌ 1947లో భారతదేశంలో విలీనం కాలేదు. అది తర్వాత కాలంలో నిర్ణయం తీసుకుని భారతదేశంలో భాగమయ్యారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా.. అక్కడి ప్రజల మనోభావాల్ని గుర్తించకుండా శాంతి తీసుకురాలేం. దీన్ని గుర్తించకుండా.. రాజకీయ కారణాలతో కశ్మీర్ సమస్యను జఠిలం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం… పీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయ అవసరాలతో పీడీపీతో దూరమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఏ రకంగా శాంతి నెలకొల్పుతారు…? దీని ఏ రకంగా..రాజకీయం పరిష్కారం చూపిస్తారు..? పాకిస్తాన్‌కు అవకాశం ఇవ్వకూడదనుకుంటే.. కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలి. అలా కాకుండా అణచి వేస్తామంటే… సాధ్యమయ్యే పని కాదు. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే… స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడమే ఓ పరిష్కారం. . స్వయంప్రతిపత్తి ఇవ్వడమేంటే…దేశం నుంచి విడిపోవడం కాదు. దేశం నుంచి విడిపోవాలనే వారితో… రాజ్యాంగాన్ని గౌరవించని వారితో ఎలాంటి రాజీ లేదు. కానీ రాజ్యాంగానికి లోబడి… కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెదకాలి. అలా కాకుండా.. కేవలం మిలటరీతోనే పరిష్కారం కనుగొంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close