బీహార్‌లో నితీష్‌ను నమ్మి నట్టేట మునుగుతున్న బీజేపీ

కర్ణాటకలో కిందా మీదా పడుతూ నడుసున్న కుమారస్వామి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కక్కుర్తితో పడగొట్టింది బీజేపీ. మిగతా కాలన్ని తాను కైవసం చేసుకుంది. కానీ మళ్లీ ఎన్నికలకు వచ్చే సరికి తుడిచి పెట్టుకుపోయింది. అదే కుమారస్వామి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగించినట్లయితే.. గత ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో ఏకపక్ష విజయం సాధించి ఉండేది. కానీ కాంగ్రెస్ దరిద్రాన్ని అత్యుత్సాహంతో తమ నెత్తిన వేసుకుంది. ఇలా చేసింది ఒక్క కర్ణాటకలోనే కాదు.. మహారాష్ట్రలో.. బీహార్‌లో కూడా.

బీహార్ లో నితీష్ కుమార్ చేసే రాజకీయాలతో అక్కడి ప్రజలకు ఇప్పటికే విరక్తి పుట్టేసింది. ఎప్పుడు బీజేపీతో కలుస్తారో.. ఎప్పుడు కాంగ్రెస్ తో కలుస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆయన బీజేపీతో ఉన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసి లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ ఈ రాజకీయంలో బీజేపీ ముందుగానే నష్టపోయింది. సగం సీట్లు మిత్రపక్షాలకుకేటాయించి రంగంలోకి దిగింది. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీచేస్తుండటం ఇండియా కూటమికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019లో 39 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కగా, ఆర్జేడీ ఖాతా తెరవలేకపోయింది. అప్పట్లో రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీని చీల్చి ఆ చీలిక పార్టీతో పొత్తులు పెట్టుకుని అనుకున్న సీట్లు సాధించింది. కానీ ఈ సారి నేరుగా పాశ్వాన్ కుమారుడి పార్టీతోనే పొత్తులు పెట్టుకుంది. అయినా ఎదురీదుతోంది. మోదీ అక్కడ ప్రచారం చేసినట్లుగా మరే రాష్ట్రంలోనూ ప్రచారం చేయలేదు.

లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్ ఫ్యూచర్ లీడర్ గా ఎదిగారు. ఆయన బీజేపీ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉంటున్నారు. తేజస్వీ.. బీహార్‌ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పట్టు సంపాదించుకున్నారు. బీహార్‌లో భారీగా సీట్లు నష్టపోతే కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో కనీసం 30కి పైగా సీట్లలో గెలిచేందుకు ఎన్డీయే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎన్ని సీట్లు తగ్గితే అంతగా బీజేపీ నష్టపోనుంది. ఎంత నష్టపోతారన్నది ఫలితాల్లో తేలుతుంది. అక్కడ నితీష్ దెబ్బ గట్టిగా పడితే ఢిల్లీలో అధికారానికి దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close