జగన్ రెడ్డి పాలనలో టీటీడీ ప్రతిష్ఠను మంటగలిపారు. జేబులు నింపుకునేందుకు దేవుడి ప్రసాదాన్ని కూడా వదల్లేదు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేయించి భక్తుల విశ్వాసంపై దాడి చేశారన్న విమర్శలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడి ఎన్నికల ప్రచార ఖర్చులను టీటీడీ నుంచి కాజేశారు అనే ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా టీటీడీని బ్యాంక్ ఆఫ్ వైసీపీగా మార్చేశారని అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
టీటీడీని భ్రష్టు పట్టించిన వైసీపీ వ్యవహారంపై ఇంకా చర్చ జరుగుతుండగానే మరో స్కామ్ కూడా చోటు చేసుకుందని బీజేపీ నేత భాను ప్రకాష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి తులాభారం కానుకలు కూడా కొట్టేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా విజిలెన్స్ ఎస్పీకి అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కల్తీనెయ్యితోపాటు తులాభారం కేసును కూడా చేదించాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ హయాంలో టీటీడీలో పని చేసిన ఉన్నతాధికారులు , విజిలెన్స్ సిబ్బందిని సైతం విచారించాలని కోరినట్లు భాను ప్రకాష్ చెప్పారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగానే భూమన కరుణాకర్ , వైవీ సుబ్బారెడ్డిలతోపాటు టీటీడీ మాజీ ఈవోలను విచారించే అవకాశం ఉంది. విజిలెన్స్ విచారణ ప్రారంభమైతే వైసీపీ నేతలు ఊచలు లెక్కపెట్టడం ఖాయంగా తెలుస్తోంది.