విమర్శల నేపథ్యంలో నిఘా హడావుడి

న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలన్నది న్యాయశాస్త్ర సూత్రం. పని జరక్కపోయినా ఫర్వాలేదు గాని జరిగినట్టు కనిపించాలన్నది అధికార వర్గాల కపట సూత్రం. ఏ విషయంలో విమర్శలు పెరిగితే లేక వైఫల్యాలు బయిటపడితే ఆ రంగంలో హడావుడి పెంచడం మన ప్రభుత్వాలకూ అధికారులకూ పరిపాటి. వూరి సైనిక స్తావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 18మందిని బలిగొన్న ఘటన దేశాన్ని ఉడికించింది. నిర్దిష్టంగా ఉరి సైనిక కేంద్రంపైనే దాడి జరగనున్నట్టు హెచ్చరిక పంపించిన పది రోజులకే ఈ ఘోరం జరిగితే ఎందుకు పసిగట్టలేకపోయామన్న ప్రశ్న ప్రతివారికీ ఎదురైంది. రోజూ 90శాతం చొరబాట్లను నిరోధిస్తుంటామని, పదిశాతం మాత్రమే అనుకున్నట్టు జరుగుతాయని అటు నిఘా అధికారులు ఇటు సైనికాధికారులు ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం సమర్థనకే పనికి వస్తుంది. 12వేల మంది సైనికులున్న కేంద్రంలోకే విద్రోహులు చొరబడగలగడం దేశ భద్రతకే పెను సవాలు. సైనిక పటాలాలు మారుతున్న సందర్బంలోనే ఇలాటి దాడులకు అవకాశం వస్తుందన్న వాదన కూడా సంజాయిషీగా పనికి రాదు. ఎందుకంటే సైన్యంలో అది నిరంతర ప్రక్రియ. ఈ దాడి తర్వాత రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ స్వయంగా . ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఎలా రాగలిగారు? వచ్చినా సైనిక కేంద్రంలోకి ఎలా చొరబడగలిగారు? అని అడిగారు. సమాధానం చెప్పవలసిన వారే ప్రశ్నలు వేయడం హాస్యాస్పదం. ఈ విషయం అర్థం కాబట్టే ఆలస్యంగా ఆయన ఏవో తప్పిదాలు వున్నాయని అంగీకరించారు . కాని ప్రభుత్వ వ్యూహాత్మక గజిబిజిని రాజకీయ బాధ్యతనూ స్వీకరించడానికి సిద్దంగా లేరు. కాని మరో వైపున ఏదో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అప్రమత్తత పెంచినట్టు కనిపించేందుకు నానా హడావుడి చేస్తున్నారు. వూరి దాడి మర్నాడే కాశ్మీర్‌ సరిహద్దులలో పదిమంది చొరబాటుదార్లను హతమార్చినట్టు ప్రకటించారు. ఇక గురువారంనాడు ముంబాయిలోని కరంజా సమీపంలో ఉన్‌ నౌకా స్థావరం వద్ద ఒక అనుమానాస్పద వ్యక్తి సంచరించినట్టు తెలియడంతో అంతా కట్టుదిట్టం చేసినట్టు వార్తలు గుప్పిస్తున్నారు. నిజంగా అలాటిది వుంటే అంతర్గతంగా వెంటాడి పట్టేసుకోవాలి గాని ఇంత బాహాటంగా ప్రచారం చేస్తే శత్రవులు దొరుకుతారా? ఈ విషయమై నవీముంబాయి, కొలాబా పోలీసు స్టేషన్లకు వర్తమానం పంపించామంటున్నారు. మరోవైపున కాశ్మీర్‌ సరిహద్దులోని కుప్వారా జిల్లాలో ఇద్దరు చొరబాటుదార్లను హతమార్చినట్టు కూడా సమాచారం విడుదల చేశారు. నిజానికి సరిహద్దుల్లో రోజూ ఇలాటివి జరుగుతూనే వుంటాయి. అయితేనేం ఇప్పుడు దానికే విస్త్రత ప్రచారంతో బిల్డప్‌ అవసరమవుతున్నది మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close