రాజధానిలో మాటలు మాయ- ప్లాట్ల కేటాయింపు వేరయా!

ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రకరకాల సమస్యలు పై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇష్టంగా భూమి అప్పగించిన వారికి కూడా ఆశాభంగం కలుగుతున్నది. తొలి దశలో ప్రభుత్వ మాటలు ఏ మేరకు విశ్వసించాలో తెలియక వూగిసలాడుతున్న రైతులను ఒప్పించేందుకై మంత్రులు పుత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటివారు రంగంలోకి దిగారు.మీకు మీ వూళ్ల దగ్గర్లోనే ప్లాట్ల కేటాయింపు వుంటుందని భరోసాగా చెప్పారు. సభల్లో ప్రశ్నలు సమాధానాల తతంగం నడిపించారు. ఇది నమ్మి చాలా మంది భూములు అప్పగించి దగ్గరలోనే వాణిజ్య ప్లాట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఆ విధమైన కేటాయింపులు నడుస్తున్నాయని రైతులు చాలా ఆనందంగా వున్నారని కొన్ని పత్రికల్లోనూ చానళ్లలోనూ కథనాలు ప్రసారం అవుతున్నాయి. రైతులు మాట్లాడ్డం కూడా చూపిస్తున్నారు. అది నాణేనికి ఒక వైపు మాత్రమే. తమకు ఇస్తామన్నచోట గాక మరోచోట దూరంగా విలువ తక్కువ ప్లాట్లు కేటాయించారని తెలుగుదేశం అనుకూల రైతులు కూడా నిరసన తెల్పుతున్నారు. పాలకపక్షానికి మద్దతుగా నిలిచే వెంకటపాలెం గ్రామానికి చెందిన వారికే వాగ్దానభంగం ఎదురైంది. తమకు పెనుమాక సమీపంలో ప్లాట్లు ఇవ్వడమేమటని వారు అధికారులను నిలదీశారు. శాఖమూరు రైతులూ ఇలాగే రగిలిపోయారు. మొదట చెప్పిన చోట గాక మరోచోట ప్లాట్ట కేటాయింపులు చేయడమంటే మోసగించడం కాదా అని ప్రశ్నించారు. క్యాపిటల్‌సిటీ ప్లానుతో పాటు కొండవీటి వాగు పరివాహక ప్రాంతాన్ని మార్చడం వల్ల ప్లాను మారిందని అధికారులు ఇచ్చే వివరణ వారికి ఏ మాత్రం మింగుడు పడటం లేదు.5 దొండపాటు పిచుకలపాలెం గ్రామాలలోనూ ఇలాటి సమస్యలే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close