రాహుల్-జగన్: భిన్నత్వంలో ఏకత్వం

ఒక్కోసారి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలలో సారూప్యత, కొన్ని విషయాలలో పూర్తి విభిన్నత కనిపిస్తుంటుంది. ఇద్దరి తండ్రులు హటాన్మరణం పొందారు. ఇద్దరి తల్లులు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటుంటారు. రాహుల్ గాంధీకి మద్దతుగా తల్లి, అక్క, అప్పుడప్పుడు వాద్రా బావగారు వస్తుంటారు, జగన్మోహన్ రెడ్డికి అండగా తల్లి, చెల్లి, అనీల్ బావగారు వస్తుంటారు.

ఇద్దరూ త్రుటిలో అధికారం చేజార్చుకొన్నవారే. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని స్మరించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. రాహుల్ గాంధీ మోడీని మాత్రమే శత్రువుగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రపంచంలో ఏకైక శత్రువు చంద్రబాబు నాయుడే. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకొంటుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని పరితపిస్తున్నారు. వారిద్దరిలో జగన్ కి కొంచెం ఆరాటం, ఆవేశం ఎక్కువ.

రాహుల్ గాంధీ జాతీయ స్థాయి రాజకీయాలపై, జగన్ రాష్ట్ర స్థాయి రాజకీయాలపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తుంటారు. సమర్ధమైన మోడీ పాలన కారణంగా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తుంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత, ఇంకా అనేక ఇతర కారణాల చేత జగన్ భవిష్యత్ కూడా సందిగ్ధంగానే కనిపిస్తోంది.

ఇద్దరూ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు కానీ ఇద్దరూ (రాజకీయాలలో) నీతి, నిజాయితీ, నైతిక విలువల గురించి మాట్లాడుతుంటారు. రాహుల్ గాంధీ మహిళా సాధికారత, రాజకీయ ప్రక్షాళన వంటి అనేక అంశాలలో తాను నిపుణుడనని భావిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంలో తాను ఎక్స్ పర్ట్ నని భావిస్తూ విద్యార్ధుల సందేహాలు తీరుస్తుంటారు.

మోడీ ధరించిన ఖరీదైన విదేశీకోటు గురించి రాహుల్ గాంధీ చాలా రోజులు తలుచుకొనేవారు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ బాష పరిజ్ఞానం గురించి జగన్ రోజూ తలుచుకొంటుంటారు.

వారిద్దరిలో రాహుల్ గాంధీ కంటే జగన్మోహన్ రెడ్డే చాలా సమర్ధుడని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టబోతే నాయకత్వ లక్షణాలు లేవని పార్టీలో నేతలే అడ్డుపడ్డారు. కానీ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చేసి స్వంతంగా పార్టీ పెట్టుకోవడమే కాకుండా పార్టీపై తిరుగులేని పట్టు కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ ఒక్క ఎంపి, ఎమ్మెల్యేనైనా స్వయంగా గెలిపించుకోలేరని యూపిలో అక్కయ్యకి ఆ బాధ్యతలు అప్పగించాలని ప్రశాంత్ కిషోర్ సూచిస్తే, జగన్ ఒంటి చేత్తో తన ఎంపి, ఎమ్మెల్యేలని గెలిపించుకోగల సమర్ధులు. ఇలాగ చెప్పుకొంటూపోతే భిన్నత్వంలో ఏకత్వమన్నట్లు వారిద్దరి మధ్య చాలా పోలికలు, తేడాలు కనిపిస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close