తెరాస‌తో పోరాడి మ‌రీ వాటాలు సాధిస్తామంటున్న బొత్స‌

తెలంగాణ అధికార పార్టీతో వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉన్న దోస్తీ ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదు. ఆ రెండు పార్టీల మ‌ధ్య స్నేహం ఏర్ప‌డించే ఉమ్మ‌డి రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం. అలాంటప్పుడు తెరాస‌తో వైకాపా పోరాటం చేస్తుందీ, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి రావాల్సిన వాటాల‌ను సాధించుకునే క్ర‌మంలో కేసీఆర్ స‌ర్కారుపై జ‌గ‌న్ ఒత్తిడి తీసుకొస్తాని ఎవ‌రైనా ఊహిస్తారా..? కానీ, వైకాపా నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ అదే పని చేస్తామంటున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆంధ్రాకి రావాల్సిన ల‌క్ష కోట్ల ఆదాయాన్ని లాలూచీ ప‌డి వ‌దులుకున్నార‌న్నారు. ఆ ఆదాయాన్ని తెలంగాణ‌కు వ‌దిలేశార‌న్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఆయ‌న తోక ముడుచుకుని తెలంగాణ నుంచి అమ‌రావ‌తికి పరుగులు తీసుకుంటూ వ‌చ్చార‌న్నారు.

తాము అధికారంలోకి రాగానే, రాజ్యాంగ‌బ‌ద్ధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సిన ఆదాయాన్ని క‌చ్చితంగా వ‌సూలు చేసి తీర‌తామ‌న్నారు. అనుభ‌వం ఉంద‌ని ఆయ‌న‌కి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అధికార‌మిస్తే, ప‌దేళ్ల‌పాటు ఉండాల్సిన రాజ‌ధాని హైద‌రాబాద్ ని వ‌దులుకుని ఆంధ్రాకి వ‌చ్చేశార‌న్నారు బొత్స‌. ఇప్పుడు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్థానిక నేత‌ల‌పై చంద్ర‌బాబుకి న‌మ్మ‌కం పోయిందీ, అందుకే జాతీయ నేత‌ల్ని ప్ర‌చారానికి తీసుకొస్తున్నార‌నీ, వారు కూడా చంద్ర‌బాబు ఇచ్చే ప్యాకేజీల‌కు క‌క్కూర్తిప‌డి వ‌స్తున్నారంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఇక‌, రొటీన్ విమ‌ర్శ‌లు, శాప‌నార్థాలు ప్ర‌స్థావ‌న‌కు అన‌ర్హం.

తెలంగాణ నుంచి రావాల‌సిన ఆదాయాన్ని వైకాపా సాధించ‌గ‌ల‌దు అనే కోణంలో ఇంత‌వ‌ర‌కూ ఆ పార్టీ నాయ‌కులెవ్వ‌రూ మాట్లాడ‌లేదు. ఆ రెండు పార్టీల దోస్తీని ప్ర‌జ‌లు కూడా ఎప్పుడూ అలా చూడ‌లేదు. చివ‌రికి జ‌గ‌న్ కూడా… ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ లో భాగంగా తెరాస‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటున్నామ‌ని మాత్ర‌మే చెప్పుకొస్తున్నారు. అంతేగానీ, తెలంగాణ నుంచి రావాల్సిన వాటాల‌ను సాధించుకుంటామ‌ని ఆయ‌నా చెప్ప‌డం లేదు. ఇప్పుడు బొత్స చెబుతున్న‌ట్టు తెరాస‌తో పోరాడే ప‌రిస్థితి జ‌గ‌న్ కి ఉండ‌దు. చంద్ర‌బాబు నాయుడుకి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నాకే… జ‌గ‌న్ తో స్నేహం బ‌ల‌ప‌డింది. రాజ‌కీయంగా తెరాస అవ‌స‌రాల‌కు వైకాపా ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌దేమో త‌ప్ప‌… రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న‌లో భాగంగా కేసీఆర్ ని నిల‌దీసే స్థాయి వైకాపాకి ఉంద‌నే న‌మ్మ‌కం ఒక్క బొత్స‌కి త‌ప్ప… ఆ పార్టీ నేత‌ల‌కు కూడా ఉండ‌దు అ‌నడంలో ఆశ్చ‌ర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close