నాని ‘వ్యూహం’లో.. స‌మంత‌??

‘స‌మ్మోహ‌నం’ త‌ర‌వాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. నాని, సుధీర్‌బాబు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ పెట్టిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పుడు క‌థానాయిక‌గా స‌మంత పేరు వినిపిస్తోంది. నాని స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ జంట కుదిరితే… వీరిద్ద‌రికి ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. గ‌తంలో ‘ఈగ‌’లో వీరిద్ద‌రూ జోడీ క‌ట్టారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర‌వాత గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సులోనూ ఈ జంట ఆక‌ట్టుకుంది. ముచ్చ‌ట‌గా ఇది మూడో సినిమా అన్న‌మాట‌. సుధీర్ బాబు ప‌క్క‌న ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. నాని పాత్ర లో నెగిటీవ్ కోణాలుంటాయ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన డిలైట్స్ అఫీషియ‌ల్‌గా బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close