బోయ‌పాటికి హీరోలు లేరా?

బోయ‌పాటి శ్రీ‌ను.. మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. హీరోకి ఆయ‌న ఇచ్చే ఎలివేష‌న్స్ ఇంకెవ్వ‌రూ ఇవ్వ‌రు. రాజ‌మౌళి త‌ర‌వాత ఎమోష‌న్స్ క్యారీ చేయ‌డం దిట్ట‌.. బోయ‌పాటే. కాక‌పోతే.. ఇవ‌న్నీ సినిమా హిట్ట‌యిన‌ప్పుడే. సినిమా లెక్క త‌ప్పిన‌ప్పుడు.. ఆ ఎమోష‌న్స్ కూడా.. సిల్లీగా అనిపిస్తాయి. దానికి `విన‌య విధేయ రామ‌` సినిమానే ఓ ఉదాహ‌ర‌ణ‌. ఆ సినిమాలోని స‌న్నివేశాల్ని.. ఇప్ప‌టికీ జ‌నాలు ట్రోల్ చేస్తూనే ఉంటారు. `విన‌య విధేయ రామా` ఫ్లాప్‌.. బోయ‌పాటి కెరీర్‌కి పెద్ద కుదుపులా త‌యారైంది. ఆ సినిమా నుంచి బ‌య‌ట‌ప‌డి, మరో హిట్టు అందుకోవ‌డానికి, త‌న ఉనికిని చాటుకోవ‌డానికి బోయ‌పాటి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి. ఆ సినిమానే త‌న ఆశ‌లు. బాల‌య్య – బోయ‌పాటిల‌ది హిట్ కాంబో. సింహా, లెజెండ్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమా. కాబ‌ట్టి అంచ‌నాలు త‌గ్గ‌వు. పైగా ఒక‌రితో ఒక‌రు బాగా ట్యూన్ అయిపోయారు. ఈమ‌ధ్య బాల‌య్య‌ని బోయ‌పాటి చూపించిన‌ట్టు మ‌రెవ్వ‌రూ చూపించ‌లేదు.కాబ‌ట్టి.. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఈలోగా త‌న త‌దుప‌రి సినిమానీ ఫైన‌ల్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు బోయ‌పాటి. దిల్ రాజు ద‌గ్గ‌ర‌బోయ‌పాటి అడ్వాన్స్ తీసుకున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. అది బోయ‌పాటికి హౌం బ్యాన‌ర్ లాంటిది. `భ‌ద్ర‌` త‌ర‌వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌లేదు. సో.. ఈసారీ మంచి సినిమానే ఆశించొచ్చు.

కాక‌పోతే.. ఒక్క‌టే స‌మస్య‌. బోయ‌పాటికి హీరోలు దొర‌క‌డం లేదు. `విన‌య‌విధేయ రామా` త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్‌.. బోయ‌పాటితో సినిమా చేసే ధైర్యం చేయ‌డు. ఎన్టీఆర్ కీ అంత `ద‌మ్ము` ఉండక‌పోవొచ్చు. మ‌హేష్ బాబు తో బోయపాటి ఓసినిమా చేయాల‌నుకున్నాడు. కాక‌పోతే.. బోయ‌పాటి శైలి త‌న‌కు న‌ప్ప‌ద‌ని భావించిన మ‌హేష్ చాలా కాలం నుంచి బోయ‌పాటిని దూరంగా ఉంచుతున్నాడు. ప్ర‌భాస్ బోయ‌పాటికే కాదు.. ఎంత పెద్ద ద‌ర్శ‌కుడికైనా దొర‌క‌లేని ప‌రిస్థితి. బోయ‌పాటితో ట్యూన్ అవ్వ‌గ‌లిగింది, బోయ‌పాటి అడిగిన వెంట‌నే `సై` అనేది బ‌న్నీనే. కానీ.. బ‌న్నీ చేతిలోనూ చాలా ప్రాజెక్టులున్నాయి. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ. ఈ కాంబినేష‌న్ క‌ష్ట‌మే.

ఈమ‌ధ్య బోయ‌పాటి-విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. అదీ.. అనుమాన‌మే. ఎందుకంటే… ఈ కాంబో సెట్ట‌వ్వాల‌న్నా దేవ‌ర‌కొండ చేతిలోని ప్రాజెక్టులన్నీ పూర్త‌వ్వాలి. సో… తెలుగులో స్టార్ హీరోలెవ‌రూ బోయ‌పాటికి అందుబాటులో లేరు. బాల‌య్య‌తో సినిమా సింహా, లెజెండ్ స్థాయిలో సూప‌ర్ హిట్ట‌యిపోయి, హీరోల కాల్షీట్ల‌లో అనుకోని గ్యాప్‌లు వ‌చ్చి, మ‌న‌సు మార్చుకుంటే త‌ప్ప‌.. ఈనాటి అగ్ర హీరోలెవ‌రూ బోయ‌పాటికి అందుబాటులోకి రాక‌పోవొచ్చు. ఒక్క బోయ‌పాటికే కాదు, చాలామందికి ఇదే స‌మ‌స్య ఎదుర‌వుతోంది. కాక‌పోతే.. బోయ‌పాటి ఇప్పుడు అర్జెంటుగా మ‌రో సినిమాని కూడా ఖ‌రారు చేసేసుకోవాల‌ని భావిస్తున్నాడు. అందుకే హీరోల అన్వేష‌ణ మొద‌లెట్టాడు. మ‌రి బోయ‌పాటికి త‌గిన హీరో ఎప్పుడు, ఎక్క‌డ దొరుకుతాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close