అవ‌స‌రాల‌తో నాని?

న‌టుడిగా విభిన్న‌మైన మార్క్ సంపాదించుకున్నాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటూనే ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ని తీస్తూ… మంచి పేరే తెచ్చుకున్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యో అత్యుతానంద చిత్రాలు అవ‌స‌రాల ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు అవ‌స‌రాల‌. ఇప్పుడు నాని కోసం ఓ క‌థ త‌యారు చేస్తున్నాడ‌ట‌. అవ‌స‌రాల – నాని మంచి మిత్రులు. `అష్టాచ‌మ్మా`లో ఇద్ద‌రూ ఒకేసారి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అవ‌స‌రాల‌ది సున్నిత‌మైన కామెడీ టైమింగ్. అది నానికీ బాగా న‌ప్పుతుంది. ఇటీవ‌ల నానికి ఓ లైన్ వినిపించాడ‌ట అవ‌స‌రాల‌. అది నానికి బాగా న‌చ్చింద‌ని, `త్వ‌ర‌లోనే క‌లిసి చేద్దాం` అని నాని మాటిచ్చాడ‌ని తెలుస్తోంది. నాని చేతిలో ప్ర‌స్తుతం రెండు మూడు సినిమాలున్నాయి. అవ‌స‌రాల కూడా మెల్లిగా సినిమాలు చేసే టైపు. నాగ శౌర్య సినిమా పూర్తి చేసి, నాని సినిమాపై ఫోక‌స్ పెట్టేలోగా.. నాని కూడా త‌న చేతిలోని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాడు. సో.. ఈ కాంబో సెట్ట‌యిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

HOT NEWS

[X] Close
[X] Close