రామ్‌ చ‌ర‌ణ్‌తో ఫిక్స‌యిపోయిన‌ట్టే

జ‌య జాన‌కి నాయ‌క త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఏంట‌న్న‌ది ఇంకా తేల‌లేదు. బాల‌య్య‌తో మ‌రో సినిమా చేయాల‌ని బోయ‌పాటి త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. 2018 ఏప్రిల్‌లో ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్తుంద‌ని చెప్పుకొన్నారు. అయితే… ఈలోగా బాల‌య్య ఐడియా మారింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ పై బాల‌య్య దృష్టి పెట్టారు. తేజ ద‌ర్శ‌కుడిగా ఫిక్స‌యిపోయాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. బాలయ్య ప్ర‌స్తుతం కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. సంక్రాంతికి ఈసినిమా వ‌చ్చేస్తోంది. ఆ వెంట‌నే ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లెట్టేస్తాడు బాల‌య్య‌. అంటే…. బోయ‌పాటి సినిమా మొద‌లెట్ట‌డానికి మ‌రో యేడాదైనా ప‌ట్ట‌నుంది. అందుకే…. బోయ‌పాటి మ‌రో హీరో వేట‌లోప‌డ్డారు. బోయ‌పాటితో ప‌నిచేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నాడు. బోయ‌పాటికీ ఇదే మంచి ఆప్ష‌న్‌. రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్‌ల సినిమా సంక్రాంతికి వ‌చ్చేస్తోంది. ఆ త‌ర‌వాత‌… కొర‌టాల శివ సినిమా మొద‌లెట్టాలి. ‘భ‌ర‌త్ అను నేను’తో బిజీగా ఉన్న కొర‌టాల‌… చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డానికి టైమ్ తీసుకొనే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అందుకే… ఈ గ్యాప్‌లో బోయ‌పాటితో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆల్రెడీ చిరంజీవి 152వ చిత్రం చేసే ఛాన్స్ బోయ‌పాటి ద‌క్కించుకొన్నాడు. అంత‌కంటే ముందే చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తాడ‌న్న‌మాట‌. డి.వి.వి. దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి కొద్ది రోజుల్లో ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.