ఆంధ్రప్రదేశ్ లో అనధికారంగా నిర్మించిన భవనాలను చట్టబద్ధం చేసుకునేందుకు ‘బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025’ (BPS-2025) అమల్లో ఉంది. 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనధికార లేదా అనుమతి ఉల్లంఘనలతో ఉన్న భవనాలను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ప్లికేషన్లు ఆన్లైన్లో మాత్రమే www.bps.ap.gov.in వెబ్సైట్లో మార్చి 12, 2026 వరకు సమర్పించవచ్చు.
BPS-2025 స్కీమ్ 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు మున్సిపల్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా లేదా అనుమతి ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన అన్ని రకాల భవనాలను కవర్ చేస్తుంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్, అపార్ట్మెంట్లు, ఇండస్ట్రియల్ భవనాలు ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా అనధికార నిర్మాణాలు డిమాలిషన్ భయం లేకుండా చట్టబద్ధం అవుతాయి, భవిష్యత్ లావాదేవీలకు అడ్డంకి ఉండదు. “ అయితే, పార్కింగ్ ఏరియా మినహా మొత్తం వయోలేటెడ్ బిల్టప్ ఏరియాపై లేదా మొత్తం బిల్టప్ ఏరియాపై పెనల్ చార్జ్‌లు విధిస్తారు.
పెనలైజేషన్ చార్జ్‌లు భవన మార్కెట్ వాల్యూ ఆధారంగా నిర్ణయిస్తారు. అప్లికేషన్ సమర్పణ సమయంలో రూ.10,000 ఇనిషియల్ పేమెంట్ చేయాలి, మిగిలిన బ్యాలెన్స్ 120 రోజుల్లో చెల్లించాలి. ఈ ఫీజులు భవన యాక్సెంట్, స్థానం, వయోలేషన్ రకం ఆధారంగా మారుతాయి. 60 చదరపు గజాల ప్లాట్‌లో గ్రౌండ్ +1 (G+1) వరకు రెసిడెన్షియల్ భవనాలకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ స్కీమ్‌తో ప్రభుత్వం అనధికార నిర్మాణాల సంఖ్య తగ్గించి, పట్టణ ప్రణాళికలకు క్రమబద్ధత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాలకు bps.ap.gov.in చూడండి లేదా టోల్‌ఫ్రీ నెం. 1800-425-0015కు కాల్ చేయవచ్చు.
