తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయం నుంచి బయటపడేందుకు వైసీపీ తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును టార్గెట్ చేసి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయుడు సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు.
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారుని ఆయన ఆరోపించారు. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారుని.. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమని ఆయన మండిపడ్డారు.
దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని ఆయన ప్రకటించారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నాయుడుపై కొన్ని ఫోటోలు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోల్లో అసభ్యంగా ఏమీ లేదు. మరో మహిళతో నిలబడి మాట్లాడుతున్నట్లుగా ఉంది. మరో ఫోట్లో షిరిడి విమానాశ్రయంలో మరో మహిళతో ఉన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేశారు. వీటిని వైరల్ చేస్తూ.. టీటీడీ చైర్మన్ వీడియోలు అని వైసీపీ సోషల్ మీడియా విమర్శలు చేస్తోంది.
కల్తీ నెయ్యి అంశం బయటకు వచ్చినప్పటి నుండి టీటీడీపై వైసీపీ భయంకరమైన దాడి చేస్తోంది. ఈ సారి ఏకంగా టీటీడీ చైర్మన్ పైనే ఫేక్ దాడి చేయడం సంచలనంగా మారుతోంది.
