భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ , వైసీపీ అధినేత జగన్ ఇటీవల కొన్ని ప్రత్యేకమైన సిగ్నల్స్ పంపుతున్నారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా భారీ యుద్ధం చేసేందుకు రెడీ అన్నట్లుగా వారు సంకేతాలు ఇస్తున్నారు. జగన్ ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలపై అవినీతి ఆరోపణలు చేస్తూండటం, కేసీఆర్ నేరుగా ప్రెస్మీట్లో మోడీ వచ్చాకే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లడుతూండటంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. వీరిద్దరూ ఇతర కూటముల్లోకి వెళ్లలేరు. కానీ కలసి రాజకీయాలు చేస్తే బలంగా ఉంటామని మాత్రం నమ్ముతున్నారు.
కేసీఆర్, జగన్ ఓ ప్రత్యేకమైన కూటమి
దేశ రాజకీయాలంతా ఓ వైపు సాగుతూంటే.. బీఆర్ఎస్, వైసీపై మాత్రం మరో వైపు సాగుతూంటాయి.వారు కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లలేరు. బీజేపీ కూటమిలోకి వెళ్లలేరు. కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తే ఎక్కడ టార్గెట్ అవుతామో.. ఎక్కడ కేసుల పాలవుతామోనన్న భయం ఉంటుంది. అదే సమయంలో వీర బీజేపీ కూటమిలోకి వెళ్లలేరు. ఇద్దరికీ ఓటు బ్యాంక్ సమస్య ఉంటుంది. జగన్ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే ఆయన పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. కేసీఆర్ ఇప్పుడు చాలా ఓటు బ్యాంక్ ఆ పార్టీకి కోల్పోయారు కాబట్టి.. పొత్తులు పెట్టుకోవడానికి రెడీనే .కానీ బీజేపీనే ఆసక్తి చూపించడం లేదు. పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధపడ్డారని సీఎంరమేష్ చెప్పారు. సాధ్యం కాలేదు. అందుకే తాము ఓ కూటమిగా ఉండాలని కేసీఆర్, జగన్ అనుకుంటున్నారు.
ఎన్ని ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అంత బలమని వీరి ప్లాన్
జగన్ పుట్టినరోజు సందర్భంగా సజ్జల..జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతారని జోస్యం చెప్పారు. అందరి లక్ష్యం అదే. కేసీఆర్ కూడా అలాంటి లక్ష్యం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.కానీ కలసి రావడం లేదు. గత ఎన్నికల్లో ఏపీ,తెలంగాణ, మహారాష్ట్ర ఇలా కొన్ని రాష్ట్రాలను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తే జీరో ఫలితం వచ్చింది. అటు జగన్ పరిస్థితి అంతే. అంతే వచ్చే ఎన్నికల్లో అయినా ఆ చక్రం తమ చేతికి వస్తుందని అనుకుంటున్నారు. వైసీప బలం తనకు అదనపు బలం అవుతుందని కేసీఆర్ అనుకుంటున్నారు. జగన్ అలా అనుకోకపోయినా.. ఇప్పటికైతే కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
వచ్చే ఆరు నెలల్లో బీజేపీపై డైరక్ట్ ఎటాక్ ప్రారంభిస్తారా?
వచ్చే ఆరు నెలల్లో తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని బీజేపీపై వీరు యుద్ధం ప్రకటించబోతున్నారని తాజా పరిణామాలను బట్టి అర్థం అవుతోందని రాజకీయ వర్గాలంటున్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కేవలం బీజేపీకి తామున్నామని గుర్తు చేయడానికేనని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ వీరి ఉనికిని పెద్దగా గుర్తించడం లేదు. వీరు కనుక.., బీజేపీపై యుద్ధం ప్రకటిస్తే.. రాజకీయాల్లో కాస్త మార్పు వస్తుంది. కానీ వీరు ఆ ధైర్యం చేస్తారా..? ఆరంభ శూరత్వమా అన్నది త్వరలో తెలుస్తుంది.
