కవిత బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలతో ఆ పార్టీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. అనూహ్యంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితను కుక్కతో పోల్చి విమర్సలు చేశారు. హరీశ్‌రావుపై లేని పోని నిందలు వేసి పార్టీ నుండి వెళ్ళగొట్టి… రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ను జైలులో వేసి.. తెలంగాణను దోచుకోవడానికి కవిత చూస్తోందని ఆరోపించారు. అన్ని మీడియా చానళ్లను పిలిచి ప్రెస్‌మీట్ పెట్టిన మాధవరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ అని విమర్శించారు. ఉద్యమం చేయకుండానే తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. ఇది మాధవరంకు ఆగ్రహం తెప్పించింది. హైదరాబాద్ ఎమ్మెల్యేల పై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని నీ గురించి చెబితే తల ఎక్కడ పెట్టుకుంటావో తెలియదన్నారు. బట్టల షాపులు, బంగారు షాపులను ఎవర్ని వదలకుండా దోచుకున్నావు… నువ్వునన్ను విమర్శిస్తావా? నీ అత్తగారి ఊర్లో గెలవడం చేతకాని నీవు మాపై మాట్లాడుతావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర హినూరాలు కవిత మా పై మాట్లాడే అర్హత లేదన్నారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే లు కలిసి కెసిఆర్ తో నడుస్తున్నామని.. నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీ.టీ బ్యాచ్ అని ఎమ్మెల్సీ కవిత అంటుందా అని మండిడ్డారు. ఉద్యమంలో పనిచేయకపోయేనా తాము అందరం తెలంగాణ కోసం పని చేశాం.. తెలంగాణ చరిత్ర ను లిక్కర్ పేరుతో నాశనం చేసిదంని కవితపై విరుచుకుపడ్డారు. చివరకు ఇంట్లో కుక్క పేరు విస్కీ అని పెట్టుకున్నారని.. మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను అనే స్థాయి నీకు లేదన్నారు. నీ లాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మెరిగి పోయారు.. కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు.
నీ బండారం బయట పెడితే తెలుస్తుంది.. ఏ బంగారం షాపు వదలలేదని .. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా ఉందని స్పష్టం చేశారు. ఓవర్ ల్యాప్ ల్యాండ్ ని….పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నావు.. మర్యాదగా చెపుతున్న జాగ్రత్త గా మాట్లాడు అని హెచ్చరించారు. ఇంకో సారి మా పార్టీ పై కానీ మా ఎమ్మెల్యే ల పై కానీ మాట్లాడితే ఊరుకోనన్నారు. మాధవరం ఈ విధంగా మాట్లాడటానికి పై స్థాయి నుంచి అనుమతి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
