జూ.ఎన్టీఆర్‌పై చర్చ – పని లేని టీడీపీ నేతల పంచాయతీ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి మొన్నటిదాకా వైసీపీ నేతలు రాజకీయం చేసేవారు. టీడీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించేవారు. రకరకాల బ్యానర్లు టీడీపీ ర్యాలీల్లో వైసీపీ కార్యకర్తలే తీసుకు వచ్చారు. ఇక కొడాలి నాని వంటి వారు టీడీపీని ఓడిస్తేనే పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తాయని చెబుతూ గుడివాడలో ప్రచారం చేసుకున్నారు. ఇదంతా వైసీపీ వాళ్లు చేసింది. ఎన్నికలైన తర్వాత దాన్ని తామే అంటించుకుని రచ్చ చేసుకుంటున్నారు టీడీపీ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే రాజకీయం స్టార్ట్ అయింది.

ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు ?

ఉదయం లోకష్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న తన పట్టు పరిశ్రమలోని మొదటి ఆయుధాన్ని ప్రయోగించారు. సాయంత్రానికి ఏబీఎన్‌లో కూర్చుని టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్నించి మరో అస్త్రం ప్రయోగించారు. ఆయన వ్యాఖ్యల ఉద్దేశాలేమిటో కానీ .. అసలు జూ.ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం ఏముందని .. ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించడం ప్రారంభించారు. అటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఏం సంబంధమని ఆయన పదిహేనేళ్లుగా పార్టీని పట్టించుకోవడం లేదని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇలా రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

కెరీర్ పైనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్

2009లో టీడీపీకి ప్రచారం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాల నుంచి కనుమరుగు అయ్యారు. ఆయన తన కెరీర్ పై దృష్టి పెట్టాలనుకున్నారో అంతర్గతంగా ఇంకేమైనా రాజకీయాలు జరిగాయో అది వారికే తెలుసు. కానీ రాజకీయ నీడ పడకూడదని ఎన్టీఆర్ గట్టిగా అనుకున్నారు. అందుకే తన సోదరి కూకట్ పల్లిలో పోటీ చేసినా ప్రచారం చేయలేదు. రాజకీయ పరమైన అంశాలు ఎంత తీవ్రమైనవైనా స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఆయన బాలీవుడ్ కు వెళ్లారు. అక్కడ క్లిక్ అయితే .. మార్కెట్ పెంచుకుంటారు. ఈ విషయంలో మరో ఆలోచన లేకుండా తన కెరీర్ పైనే దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ఎందుకు ఎన్టీఆర్ ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ – టీడీపీ కార్యకర్తలు వేరా ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు వేర్వేరు కాదు. అందరూ ఒకటే. ఆ విషయం కాస్త తెలివి ఉన్న వారెవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి రాజకీయాల వల్ల విభజన వస్తుంది తప్ప .. కలసి వచ్చేదేమీ ఉండదు . జూనియర్ ఫ్యాన్స్ అని వైసీపీ అభిమానులు ఎవరైనా చెప్పుకుని పోస్టులు పెట్టుకుంటే.. అదంతా ఫేక్ అని గుర్తించడం పెద్ద విషయం కాదు. టీడీపీ భవిష్యత్ ఎవరు అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ విషయంపై సొంత పార్టీలో రచ్చ చేసుకుంటే.. పనికి మాలిన విషయాల మీద ట్రెండింగ్‌లు చేసుకుంటే నష్టపోయేది మాత్రం టీడీపీనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close