బాబుగారికి మ‌రో బంప‌ర్ ఆఫ‌రండీ…

జ‌గ‌ప‌తి బాబు సుడి అలా ఇలా తిరగ‌డం లేదు. ఎప్పుడైతే విల‌న్‌గా మారాడో… అప్ప‌టి నుంచీ ఆయ‌న అదృష్టం.. హైవే ఎక్కేసి ప‌రుగులు తీస్తోంది. హీరోగా చేసిన‌ప్పుడు ప‌ట్టుమ‌ని ఇర‌వై ల‌క్ష‌లు ఇవ్వ‌డానికి మొహ‌మాట‌ప‌డిపోయేవారు. ఇప్పుడు కోట్లు గుమ్మ‌రిస్తున్నారు. లెజెండ్‌, శ్రీ‌మంతుడు సినిమాల‌కు గానూ భారీ పారితోషికం అందుకొన్నాడు జ‌గ‌ప‌తి. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకీ.. జ‌గ‌ప‌తి కోరినంత ఇచ్చారు నిర్మాత‌లు. అయితే… ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబుకి త‌నే ఊహించ‌నంత భారీ ఆఫ‌ర్ అందింది. ఏకంగా కోటిన్న‌ర పారితోషికం ఇవ్వ‌డానికి త‌మిళ నిర్మాత‌లు ముందుకొచ్చారు.

విజ‌య్ క‌థానాయ‌కుడిగా తుప్పారివార‌న్ అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో జ‌గ‌ప‌తికి విల‌న్ పాత్ర ద‌క్కింద‌ని స‌మాచారం. కాల్షీట్లు భారీగా కావ‌ల్సిరావ‌డంతో.. దానికి త‌గ్గ‌ట్టే పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు సిద్ద‌మ‌య్యార‌ట‌. జ‌గ‌ప‌తి బాబు ఉంటే.. ఆసినిమాకి తెలుగులోనూ మంచి బిజినెస్ జ‌రుగుతుంద‌ని నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే కోటిన్న‌ర పారితోషికం ఆఫ‌ర్ చేశార‌ట‌. ఇంత పారితోషికం ఊహించ‌ని జ‌గ‌ప‌తి.. మ‌రో ఆలోచ‌న లేకుండా ఈ సినిమాకి ఓకే చెప్పేశాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి జ‌గ‌ప‌తిబాబు టైమ్ బాగుందిప్పుడు. కోరుకోకుండానే కోట్లు వ‌చ్చిప‌డుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close