మోడీకి ఇకనైనా కనువిప్పు కలిగేనా..?

తప్పులో కాలేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా లేదా అనేదే ఇప్పుడు దౌత్య నిపుణులు చర్చిస్తున్న తాజా అంశం. ప్రపంచమంతా వేరు. పాకిస్తాన్ వేరు. అక్కడ పైకి కనిపించే ప్రభుత్వం నామమాత్రం. తెరవెనుక చక్రం తిప్పే ఆర్మీనే పవర్ ఫుల్. అది తయారు చేసిన ఐఎస్ఐ అనే భూతం అనుక్షణం భారత్ పై విషం చిమ్మడానికే ప్రయత్నిస్తుంది. ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇస్తుంది. టెర్రర్ క్యాంపులు పెట్టి శిక్షణనిస్తుంది. తుపాకులు, డబ్బులు సమకూరుస్తుంది. పఠాన్ కోట్ దాడి ఇందులో భాగమే.

పఠాన్ ఎయిర్ బేస్ లో దాడి చేసింది పాక్ పాలు పెంచి పోషించే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఈ దర్యాప్తులో భాగంగా పఠాన్ కోట్ లో పర్యటించిన పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ బృందం చివరకు ఐఎస్ఐ తరహాలోనే అబద్ధాలతో రిపోర్టు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

అసలు పఠాన్ కోట్ దాడి అనేది భారత్ సృష్టించిందే అని పాక్ బృందం అభిప్రాయానికి వచ్చిందట. పాక్ వ్యతిరేకంగా భారత్ సరైన ఆధారాలను ఇవ్వలేదట. ఈ విషయాలను పాక్ మీడియా వెల్లడించింది. తమ దేశాన్ని బద్నాం చేయడానికి భారత్ పఠాన్ కోట్ దాడి పేరుతో డ్రామా ఆడిందంటూ ఆ బృందం అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట.

ఇంతకన్నా పచ్చిదగా మరొకటి ఉండదు. నాలుగు రోజులు హాయిగా ఢిల్లీ, పంజాబ్ లలో తిరిగి, బిర్యానీలు తిని తీరా తప్పుడు నివేదిక ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్లను ఏమనాలి? వాళ్లు పుట్టిన దేశం ఎంత నీచమైందో, వీళ్లూ అంతే నీచంగా ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ అనే దుష్ట దేశంతో చర్చలు గత 67 ఏళ్లుగా నడుస్తున్నాయి. ఏనాడూ ఓ కొలిక్కి రాలేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేది పాకిస్తాన్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఈ వాస్తవాన్ని ప్రధాని మోడీ విస్మరించారు. గత డిసెంబర్లో కాబూల్ నుంచి ఢిల్లీ వస్తూ హటాత్తుగా లోహోర్ లో దిగారు. అందరినీ ఆశ్చర్యపరిచారు.

అది అతి ఘోరమైన చారిత్రక తప్పిదమని చాలా మంది అప్పుడే విమర్శించారు. అయినా అది సృజనాత్మక దౌత్యమంటూ కమలనాథులు కోరస్ పలికారు. పాక్ బృందం దర్యాప్తుకి భారత్ రావడానికి అనుమతి ఇవ్వడం ఏమిటి? మన ముంబై దాడి, పఠాన్ కోట్ దాడి దర్యాప్లులో భాగంగా మర అధికారులను పాక్ రానిచ్చిందా? ఈమాత్రం ఆలోచన లేకుండా పోలోమని అనుమతినిచ్చారు. ఇప్పుడు ఆ బృందమే పచ్చిదగా చేసింది.

పాక్ తో వ్యవహారం ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. కర్కషంగానే ఉండాలి. సాక్ష్యాలు ఆధారాలు పంపుతూ టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేం లాడెన్ జాడ విషయంలో పాకిస్తాన్ కు ఆధారాలు ఇచ్చామా? మేమే పని పూర్తి చేశాం భారత్ కూడా అదే పని చేయవచ్చు కదా అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆ మధ్య వ్యాఖ్యానించారు. అది అక్షర సత్యం. పాక్ తో మాటలు కాదు, తూటాలతోనే మాట్లాడాలి. అలాగని, నేరుగా యుద్ధానికి దిగలేం. యుద్ధం చేయకపోయినా, యుద్ధం చేసినంత పని చేయవచ్చు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాకిస్తాన్ కుమాత్రమే చేతనవుతుందా? మనకు చేతకాదా? లాడెన్ ను అబోటాబాద్ లో అంతం చేసిన అమెరికా తరహాలోనే మనమూ స్కెచ్ వెయ్యలేమా? మన దేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఆటను పాక్ లోనే కట్టించడానికి ప్లాన్ చెయ్యలేమా? ఈ దిశగా మోడీ ప్రభుత్వం ఆలోచించాలనేది కొందరు దౌత్య నిపుణుల సూచన. మరి మోడీ ఏం చేస్తారో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close