మళ్లీ కేసీఆర్‌కు “బండి” జైలు హెచ్చరికలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుడు ఖాయమని గతంలో జోరుగా ప్రకటనలు చేసిన బండి సంజయ్.. ఆ తరవాత మారిన రాజకీయ పరిస్థితుల్లో సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాలు రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మళ్లీ కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లో వచ్చిన ఆ మార్పు… ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడమే. వారంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని చెప్పిన ఆయన… గత వారం రోజులుగా.. కేసీఆర్‌పై ఉన్న కేసులను బయటకు తీయడానికే ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌తో పాటు మొత్తం పద్దెనిమిది మంది ముఖ్య నేతల అవినీతికి ఆధారాలు సేకరించి.. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నామని.. కేసీఆర్‌పై ఉన్న సహారా, ఈఎస్‌ఐ స్కాంల కేసులను కూడా… మదింపు చేశామన్నారు. వాటిని చూసిన తర్వాతే… కేసీఆర్ ఎంత పెద్ద అవినీతి పరుడో తేలిందని.. బండి సంజయ్ చెబుతున్నారు. బండి సంజయ్ మాటల్లో మళ్లీ పదును రావడానికి కారణం… తర్వాత కూడా టీఆర్ఎస్‌తో ఎలాంటి బంధాలు ఉండవని.. నిరూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ బీజేపీపై పడటమే కారణం. ఈటల బీజేపీ వైపు చూడటంతో… పలువురు టీఆర్ఎస్ అసంతృప్తవాదులు.. బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. వారందరి అనుమానం ఒకటే… తర్వాత బీజేపీ.. టీఆర్ఎస్ కలిస్తే తమ పరిస్థితేమిటన్నదే. అందుకే.. ఎప్పుడూ బీజేపీ- టీఆర్ఎస్ కలవవు అని చెప్పడానికి బండి సంజయ్ కొత్తగా కేసీఆర్ జైలు వాదన తీసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు.

అయితే.. బండిసంజయ్ గతంలోనూ ఇలాంటి మాటలు మాట్లాడారు. కేసీఆర్ వెళ్లి బీజేపీపెద్దలతో సమావేశం అయి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. సైలెంటయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్లు.. బండి సంజయ్ మాటలు వ్యక్తిగతం అన్నట్లుగా తీసి పడేశారు. దాతో రెండు పార్టీల మధ్య ప్యాచప్ అయిందనుకున్నారు. కానీ ఇప్పుడు… మళ్లీ కేసీఆర్‌ను సహించే పరిస్థితి లేదని… చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ… మాటలు చెబితేనే ఇప్పుడు… బీజేపీలో చేరాలనుకుంటున్న కేసీఆర్ వ్యతిరేకులు నమ్మే పరిస్థితి లేదు. ఏదో ఓ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి.. కొన్ని సోదాలు.. కొన్ని కేసులు నమోదు చేస్తే.. బీజేపీకి అనుకున్నంత ఊపు వస్తుందని… కొంత మంది చెబుతున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ముందడుగు వేస్తారో లేక.. మాటలతోనే సరిపెడతారో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close