అప్పుల ఆడిట్ చేస్తున్న కాగ్ అధికారులకూ బెదిరింపులట !?

నిజం చెప్పారో సంగతి చూస్తా..! అనే బెదిరింపులు ఇప్పుడు కామన్. అది మీడియా , సోషల్ మీడియా మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకూ తప్పడం లేదని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అప్పుల లెక్కలు తేల్చడానికి కాగ్ బృందం ఏపీలోకి వచ్చింది. వారు మొత్తం అవకవతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా అప్పుల లెక్కలు తీస్తున్నారు. ఇలా ఆరా తీస్తున్న అధికారులతో… ఖజానా గల్లాపెట్టేను దగ్గర పెట్టుకున్న ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగారట. దీంతో సచివాలయంలో గందరగోళం ఏర్పడింది. దాదాపుగా వారం రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం తర్వాత కాగ్ అధికారులు అప్పులపై మరింత నిశితంగా పరిశీలన జరుపుతున్నట్లుగా సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు ఆర్థిక శాఖ అధికారులందర్నీ కూర్చోబెట్టి… దృశ్యం సినిమాలో వెంకటేష్ చెప్పినట్లుగా .. మన అప్పులు ఇంతే.. ఇంతకు మించి మనం ఒక్క పైసా తీసుకోలేదు.. ఏమి అడిగినా ఏమీ తెలియదనే చెప్పాలని.. క్లాస్ తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాదు కూడదని ఎవరైనా నిజం చెప్పారో .. వచ్చే నెల నుంచి జీతాలు రావని వారికి ఉన్నాతాధికారులు బెదిరిస్తున్నారట. తప్పుడు లెక్కలు ఇస్తే ఇవాళ కాకపోతే తాము ఇరుక్కుపోతామని ఉద్యోగులు వణికిపోతూంటే.. చెప్పొద్దని ఉన్నతాధికారలే ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఆర్థిక శాఖలో ఇప్పుడు క్లిష్టమైన సమస్యగా మారింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పుల పరిమితి పూర్తయింది. ప్రస్తుత ఆడిట్ జరిగితే… ఇక కేంద్రాన్ని బతిమాలి అదనపు అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే వీలైనంత తక్కువ అప్పులు తీసుకున్నట్లుగా చూపించాలని అనుకుంటున్నారు. తమ వాదనకు అంగీకరించేలా పై స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే .. ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్న కాగ్ ఆడిట్ .. బెదిరింపుల వరకూ వెళ్లడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close