వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు భారత్ కూడా అలాగే పాక్ విషయంలో చర్యలు తీసుకోవచ్చు కదా అన్న డౌటనుమానం చాలా మందికి వస్తోంది. ఎందుకంటే వెనిజులాపై అమెరికా పెట్టిన అభియోగాలన్నీ.. పాక్ పై భారత్ పెడుతోంది. పాక్ లో ప్రజాస్వామ్యం మేడిపండు. మిలటరీ అంతా కరప్షన్. న్యాయవ్యవస్థపని చేయలేదు. విపక్ష నేతలంతా జైళ్లలో ఉంటుంది. అంతకు మించిభారత్ లోకి నార్కో టెర్రరిజమే కాదు అసలు టెర్రరిజాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇంత కంటే భారత్కు కారణాలేం కావాలి?
భారత్ పై ఎప్పటికప్పుడు కుట్రలకు పాల్పడుతున్న పాక్
భారత్ లో అస్థిరత సృష్టించడానికి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కుట్రలకు పాల్పడుతోంది. పార్లమెంట్ పై దాడి దగ్గర నుంచి ముంబై దాడుల వరకూ ఎన్నో ఉన్నాయి. అలాగే ఇటీవల ఢిల్లీ పేలుళ్లు ఘటనల్లోనూ పాక్ హస్తం ఉంది. కశ్మీర్ లో ఎప్పుడూ ఉగ్రవాదాన్ని అంటిస్తూనే ఉంటామని సైన్యం చీఫ్ మునీర్ వంటి వారు ప్రకటిస్తూనే ఉన్నారు. దొంగ నోట్లు, డ్రగ్స్ పాక్ నుంచి పెద్ద ఎత్తున దేశంలోకి వస్తున్నాయి. ఇండియాకు పాక్ పెను ముప్పు సృష్టిస్తుందన్నది బహిరంగ రహస్యం. దీనంతటికి కారణం పాకిస్తాన్ పాఠకులే. వారు తాము బాగుపడాలని కోరుకోవడం కన్నా ఇండియా నాశనమైపోవాలని కుట్రలు చేస్తూంటారు.
పాకలో ప్రజాస్వామ్యం మేడిపండు !
అలాగే పాక్ లో ప్రజాస్వామ్యం మేడిపండు. పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ వంటి నేతలు జైలు పాలు కావడం, సైన్యం పెత్తనం చలాయించడం అక్కడ పరిపాటి. పాక్ లో ప్రతిపక్ష నేతలు అయితే జైళ్లలో ఉంటారు లేకపోతే ప్రవాసంలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో పాలన చేస్తోంది పరోక్షంగా సైన్యమే. సైనిక జనరల్ మునీర్ ఇండియాపై ద్వేషంతో రగిలిపోయే వ్యక్తి. అతనికి దేశం కన్నా… ఇండియాపై కుట్రలు చేయడమే ముఖ్యం. అలాంటి వ్యక్తి కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తోంది.
కానీ భారత్ విధానం ఎప్పుడూ అది కాదు.
అయితే, భారత్ ఎప్పుడూ ఇలా ఇతర దేశాలపై దాడి అనే ఆలోచన రానివ్వలేదు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం అనే సిద్ధాంతాలను నమ్ముతుంది. పాక్ ఇండియా నుంచే విడిపోయింది. అయినా సరే అలాంటి ఆలోచన రానివ్లేదు. అమెరికా లాగా ఇతర దేశాల్లో ప్రభుత్వాలను మార్చడం భారత విదేశీ విధానం కాదు. పాక్ ప్రజలే తమ దేశంలో మార్పు తెచ్చుకోవాలని భారత్ కోరుకుంటుంది తప్ప వారి వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదు.
పాక్ నుండి వస్తున్న డ్రగ్స్, టెర్రరిజాన్ని అడ్డుకోవడానికి భారత్ ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ వంటి వ్యూహాలను అమలు చేస్తోంది. అంతే కానీ ఎప్పుడూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇండియా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.
