భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్టులో బాగుందిరా మామా అనే డైలాగ్ వైరల్ గా మారింది. ఇది అన్నది మన ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కాదు.. కెప్టెన్ శుభమన్ గిల్. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ స్పెల్ అద్భుతంగా వేశాడు. రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో నితీష్ బౌలింగ్ ను ఎదుర్గొనేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఓ బాల్ అద్భుతంగా స్వింగ్ అయినప్పుడు స్లిప్స్ లో ఉన్న గిల్.. నితీష్ బౌలింగ్‌ను తెలుగులో ప్రశంసించాడు. బాగుందిరా మామ అని అభినందించాడు.
నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నప్పుడు మరికొన్ని మాటలు కూడా గిల్ తెలుగులో మాట్లాడారు. స్టంప్స్ కు ఉన్న కెమెరాల్లో వాటికి దగ్గరగా ఉన్న క్రికెటర్లు బిగ్గరగా ఏమైనా మాట్లాడితే అది టీవీల్లో కూడా వచ్చేస్తుంది. గిల్ స్లిప్స్‌లో ఉండటంతో నితీష్ ను ప్రోత్సహించేందుకు అన్న మాటల ఆడియో కూడా బయటకు వచ్చేసింది. లార్డ్స్ తెలుగు మాటలు వినిపించడం సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.
నితీష్ కుమార్ రెడ్డి.. తన టీమ్ లో ఇతరులకు తెలుగు నేర్పిస్తున్నారని దీని ద్వారా అర్థమవుతుందని నెటిజన్లు అంటున్నారు. టీమిండియాలో విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వారంతా వివిధ భాషలకు చెందిన వారు. యూనివర్సల్ గా ఇంగ్లిష్ లో మాట్లాడుకున్నా.. ఇతర లాంగ్వేజ్‌లు నేర్చుకోవడానికి క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. అందరూ యువ క్రికెటర్లు కావడంతో సరదాకా..ఇలా అభినందించే మాటలు నేర్చుకుంటూ ప్రోత్సహిస్తున్నారు.