రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై రాజమండ్రిలో కేసు నమోదు అయింది. ఓ ఇంటర్యూలో వీరిద్దరూ అథ్యాత్మిక అంశాలపై చర్చించారు. ఆ చర్చ పక్కదారి పట్టింది . దేవుళ్లను కించ పరిచేలా సాగింది. హిందూ ఇతిహాసాలు, దేవతలు, భారత సైన్యంతో పాటు ఆంధ్రులను కించపరిచేలా వర్మ మాటలు సాగిపోయాయి. ఆయనతో మరిన్ని మాటలు అనిపించేలా స్వప్న ప్రశ్నలు అడుగుతూ పోయారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజమండ్రిలో ప్రజా కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకున్న మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలు ఇచ్చారు. విదేశీ శక్తుల కుట్రల్లో భాగంగానే వారు ఇలా మాట్లాడుతున్నారని మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రామ్ గోపాల్ వర్మ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొదట ఉంటారు. ఏమైనా అంటే తనకు పబ్లిసిటీ వస్తుందని అందుకే అంటానంటారు. అయితే ఇటీవలి కాలంలో కేసులు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించి అనేక కేసులకు గురయ్యారు. వాటి విచారణలకు అప్పుడప్పుడూ హాజరవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. ముంబైలో ఓ చెక్ బౌన్స్ కేసులో జైలుశిక్ష పడింది. అయితే రాజీ చేసుకుని బయటపడ్డారు.