ఈవీఎం ధ్వంసం.. ఇంకెవ‌రూ ఆ సాహ‌సం చేయ‌కుండా పిన్నెల్లికి శిక్ష‌

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈవీఎం ధ్వంసం కేసును ఈసీ సీరియ‌స్ గా తీసుకుంది. ఇప్ప‌టికే కోర్టులో ఏ-1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని ప‌రిగ‌ణించాల‌ని మెమో దాఖ‌లు చేయ‌టంతో పాటు, దాదాపు 12ఏళ్ల శిక్ష‌ప‌డేలా కొత్త సెక్ష‌న్లు పెట్టారు.

అయితే, ఈ విష‌యంలో సీఈసీ రంగంలోకి దిగ‌టంతో పోలీసులు వేగం పెంచారు. రెండ్రోజులుగా పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్ర‌త్యేక బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు. పిన్నెల్లి అరెస్ట్ కు సీఈసీ డెడ్ లైన్ విధించిన నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి కూడా స్పందించారు.

పిన్నెల్లి కోసం హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నార‌ని, ఇంకెవ‌రూ ఇలా ఈవీఎంల‌ను ధ్వంసం చేయాల‌న్న ఆలోచ‌న చేయ‌కుండా కేసులు న‌మోదు చేసి శిక్ష‌ప‌డేలా చేస్తామ‌న్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయ‌టం వ‌ల్లే పిన్నెల్లికి వ్య‌తిరేకంగా సాక్ష్యాలు దొరికాయ‌న్నారు. అయితే, అక్క‌డ ఈవీఎం ధ్వంసం అయినా డేటా భ‌ద్రంగానే ఉంద‌ని, రీపోలింగ్ అవ‌స‌రం లేద‌ని ఈసీ స్ప‌ష్ట‌తనిచ్చింది.

ఇక‌, పిన్నెల్లి దేశం విడిచిపోతార‌న్న అనుమానంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సంగారెడ్డి స‌మీపంలో ఉన్నార‌న్న స‌మాచారంతో అక్క‌డ‌కు వెళ్ల‌గా… పిన్నెల్లికి చెందిన వాహ‌నాలు దొరికాయి. కానీ అక్క‌డ‌ పిన్నెల్లి బ్ర‌ద‌ర్స్ లేర‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close