ఆర్జీవీ పావుగా భారీ కుట్ర..! విజయవాడలో కుల గొడవలకు ప్లాన్లా..?

రామ్‌గోపాల్ వర్మకు.. విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టడానికి స్థలమే దొరకలేదా..? లేక కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొట్టాడనికి నడి రోడ్డుపై.. ప్రెస్ మీట్ ను ప్రణాళికాబద్దంగా ప్లాన్ చేశారా..?. ఓ రాజకీయ కుట్రలో.. విజయవాడలో అల్లర్లకు ప్లాన్ చేశారా..?. ఆంధ్ర పోలీసులు ఇదే అనుమానంతో ఉన్నారు. దానికి తగ్గట్లుగా వారి వద్ద ఇంటలిజెన్స్ సమాచారం ఉండటంతో వెనక్కి పంపేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆర్జీవీ ఎపిసోడ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా..?

తెలంగాణ నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టారు. చంద్రబాబునాయుడు…ఫుల్ పవర్స్ తో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తలసాని లాంటి వాళ్లు వచ్చి.. చంద్రబాబునే చెడామడా తిట్టి వెళ్లారు. వాళ్లూ.. వీళ్లే కాదు. విజయవాడలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగాలనుకున్న ఏ ఒక్క సమావేశం వాయిదా పడలేదు. కానీ ఆర్జీవీ పెట్టుకున్న ప్రెస్‌మీట్ ను మాత్రం… అడ్డుకున్నట్లుగా… ప్రచారం చేస్తున్నారు. హోటల్స్, క్లబ్‌ల యాజమాన్యాలను బెదిరించినట్లుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్లెవరో బయట పెడతామని చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే… విజయవాడలో ప్రెస్‌క్లబ్‌ ఉంది. అక్కడ వారిని ఎవరూ బెదించలేరు. అలాంటి ఏర్పాట్లు చాలా చోట్ల ఉంటాయి. కానీ… ఎవరూ పర్మిషన్ ఇవ్వలేదని రోడ్డుమీద పెడతామని చెప్పడానికి కారణం ఏమిటి..?

కావాలంటే వైసీపీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాట్లు చేసేవారు కాదా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనుక.. వైసీపీ ఉంది. ఆ సినిమా నిర్మాత వైసీపీ నేత. అంతే కాదు… నేరుగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందని… ట్వీట్‌తో తెలిసిపోయింది. విజయవాడ అంటే… వైసీపీ నేతలకూ.. చాలా హోటళ్లు ఉన్నాయి. రిసార్టులు ఉన్నాయి. అంతకు మించి ఫంక్షన్ హాళ్లు కూడా ఉన్నాయి. ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే… లైవ్ టెలికాస్టింగ్ సహా ఏర్పాట్లు చేయడానికి వైసీపీ నేతలు రెడీగా ఉంటారు. టీడీపీ నేతలు బెదిరిస్తేనో…. మరో కారణం చేతనో… వారు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. అయినప్పటికీ.. ఆర్జీవీ అదే కారణం చెప్పి… ఆరోపణలు చేసి రచ్చ చేశారు.

ఆర్జీవీకి తెలియకుండానే.. ఆర్జీవినే పావుగా వాడుకుని కులగొడవలు రేపే కుట్ర జరిగిందా..?

విజయవాడ సహజంగానే.. కాస్త సున్నితమైన ప్రాంతం. అక్కడ గొడవలు రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది… రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఇదే లక్ష్యంతో.. సినిమా విడుదలకు అవకాశం లేకపోయినా.. ఆర్జీవీ రచ్చ రచ్చ చేసి.. రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టే ఏర్పాటు చేయడానికి కారణం శాంతి భద్రతల సమస్య తీసుకు రావడమేనని.. సాధారణ ప్రజల అనుమానం. అనుమానం కాదు.. అది నిజమేనని.. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అర్థం అవుతోంది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో… ఆర్జీవీ పావుగా గొడవలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయన్నది మాత్రం నిజం. ఆ రాజకీయం ఆర్జీవీకి తెలియకపోవచ్చు. కానీ ఆయన కేంద్రంగా.. విజయవాడలో అల్లర్లకు కుట్ర జరిగిందనేది మాత్రం నమ్మాల్సిన నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close