సుధాకర్ కేసులో “గుర్తు తెలియని అధికారుల”పై సీబీఐ కేసులు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ సుధాకర్ వద్దకు వెళ్లి వాంగ్మూలం సేకరించించారు. గతంలో… న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలం విషయాలు మొత్తం..మరోసారి సీబీఐ ఎస్పీకి సుధాకర్ వివరించినట్లుగా తెలుస్తోంది. తనతో పోలీసులు, అధికారులు ఎలా వ్యవహరించారో సుధాకర్ చెప్పగలిగారు కానీ..వారి పేర్లేమిటో తెలియకపోవడంతో.. గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల పేరు మీద కేసు నమోదు చేశారు.

నేరపూరత కుట్ర, ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడం , మూడ్రోజులు అంతకుమించి నిర్బంధించడం, చోరీ వంటి సెక్షన్లు సీబీఐ నమోదు చేసిన కేసులో ఉన్నాయి. తనను కొట్టారని.. తన కారులోని రూ. పది లక్షలు .. ఒక బుల్లెట్‌, కారు తాళాలు, ఏటీఎం కార్డులు ఉన్న పర్సు కూడా దొంగిలించినట్లు సుధాకర్ సీబీఐ ఎస్పీకి చెప్పారు. డాక్టర్ సుధాకర్ విషయంలో.. పోలీసులు, ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్న విమర్శలు రావడం…పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించడంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది

హైకోర్టులో జరిగిన విచారణలో…సుధాకర్ .. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారా.. పోలీస్ కస్టడీలో ఉన్నారో కూడా… ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పలేకపోయారు. సుధాకర్ విషయంలో… అనేక రకాల నిబంధనల ఉల్లంఘనలు కళ్ల ముందు కనిపిస్తూండటంతో.. ఈ కేసు వ్యవహారంలో ఉన్న పోలీసులు, సుధాకర్‌కు మానసిక వ్యాధి ఉందని.. నివేదిక ఇచ్చిన వైద్యులకు చిక్కులు తప్పవని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close