సీబీఐ రాజకీయ కుట్ర చేస్తోందని కోర్టుకెక్కిన సుజనా చౌదరి..!

కేంద్రమాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు… కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై కోర్టుకు ఎక్కారు. రాజకీయ నేతగా, పారిశ్రామికవేత్తగా ఉన్న తన ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న రాజకీయ దురుద్దేశంతోనే సీబీఐ ..”బెస్ట్ అండ్ క్రాంప్టన్” అనే కంపెనీ కేసులో తనకు నోటీసులు జారీ చేసిందని..సుజనా చౌదరి ఆరోపిస్తున్నారు. తనకు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తను ఇదే విషయాన్ని ఆధారాలతో సహా.. వెల్లడించి.. నోటీసులను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించినా మళ్లీ నోటీసులు జారీ చేసిందని.. సుజనా చౌదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖతోపాటు సీబీఐని చేర్చారు.

నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ సుజనా చౌదరిది అని కానీ.. ఆయనకు సంబంధం ఉందని కానీ…సీబీఐ ఎప్పుడూ చెప్పలేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చాలా కాలంగా సోదాలు చేస్తోంది. గతంలో సుజనా చౌదరి కార్యాలయంపైనా దాడులు జరిగాయి. ఆ తర్వాత చెన్నై ఈడీ కార్యాలయానికి సుజనాను పిలిపించి విచారించారు కూడా. కానీ ఆధారాలేమీ సేకరించలేకపోయారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ … బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేదు. అయితే బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ అసలు యజమానులను గుర్తించడానికి దర్యాప్తు సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ సంస్థ సుజనాచౌదరిదేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వైస్రాయ్‌ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇది కూడా.. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన కేసులో తీసుకున్నచర్యే. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈడీ వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.

కానీ ఇప్పటి వరకూ.. సుజనా చౌదరికి సంబంధం ఉన్నట్లు కానీ.. ఆయా కంపెనీలు… తీసుకున్న రుణాలు.. సుజనా చౌదరి కంపెనీల్లోకి తరలించినట్లుగా కానీ.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ ఏ కంపెనీల్లోకి రుణాలు వెళ్లాయో… వాటి ఆస్తుల్ని సీజ్ చేశారు. కానీ.. ఎక్కడా సుజనా చౌదరి ఆస్తులను సీజ్ చేయలేదు. అయితే.. అనేక డొల్ల కంపెనీలు పెట్టారని.. వాటి ద్వారా నిధులు తరలించారని.. సుజనాచౌదరిపై.. మీడియాకు లీకులు ఇస్తున్నారు. అదే నిజమైతే.. ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవారని… సుజనా చౌదరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సుజనా చౌదరి.. నేరుగా సీబీఐపై కోర్టుకు ఎక్కి… కొత్త సంచలనం సృష్టించారనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close