ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా… వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం కావడమో… లంచ్ లేదా స్నాక్స్‌ సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఏకాభిప్రాయం రాలేదని వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా తొమ్మిదో విడత చర్చల్ని నిర్వహించారు. మూడు గంటల పాటు మాట్లాడుకుని… నిర్మాణాత్మకంగా చర్చలు జరగలేదని.. పదోసారి భేటీ కావాలని అనుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

నిజానికి వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత రైతులు.. తమ విజయం వచ్చేసిందనుకుని వెళ్లిపోతారని.. కేంద్రం అనుకుంది. కానీ.. సుప్రీంకోర్టు నియమించిన కమిటీని చూసిన తర్వాత వారికి సమ్‌ధింగ్ రాంగ్ అనిపించింది. వెంటనే.. స్టే ఇచ్చినా పోరాటం ఆపేది లేదని ప్రకటించేశారు. తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిచాలని అంటున్నారు. కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తామని కేంద్రం అంటోంది కానీ… చట్టాలను రద్దుచేసే ప్రశ్నే లేదంటోంది. దీంతో చర్చల ప్రక్రియ ముడిపడిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితేనే… చర్చలు ముందుకెళ్తాయి. లేకపోతే.. ఎక్కడివక్కడే ఉండిపోయాయి.

అయితే.. ఎవరూ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. కానీ చర్చలు మాత్రం జరుపుతూనే ఉన్నారు. నిజానికి రైతులు.. మధ్యలో నాలుగు విడతల చర్చల తర్వాత … ఇక చర్చలకు వచ్చేది లేదన్నారు. కానీ.. తర్వాత ఎందుకో కానీ.. చర్చలకు సిద్ధమని ప్రకటించారు. వారి వైపు నుంచి మొండి పట్టుదల ఉందన్న అభిప్రాయం రాకుండా ఉండేందుకు వారు చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తమ డిమాండ్లపై మాత్రం వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. అనుకున్నది అనుకున్నట్లుగా పోరాడుతున్నారు. కేంద్రం కూడా అంతే పట్టుదలగా ఉంది. సుప్రీంకోర్టు స్టేతో కాస్త పరిస్థితి మారుతుందని కేంద్రం అనుకుంది కానీ.. ఇంకా బిగిసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close