సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ సంబరాలను .. సంతోషాలను అభిమాన ప్రపంచం కోసం బయట పెట్టింది. సాధారణంగా ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగను.. బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో చిరంజీవి కుటుంబం అంతా జరుపుకుంటుంది. ఈ సారి కూడా అక్కడే జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సందడి.. ఆ సంతోషం.. ప్రతీ క్షణం ఫోటోల రూపంలో సాక్ష్యాలుగా విడుదల చేసింది.

ఈ సారి చిరంజీవి ప్రత్యేకంగా సంబరాలు నిర్వహించారు. గానాబజానా ఏర్పాటు చేశారు. దీనికి కారణం … నాగబాబు కుమార్తెకు కొత్తగా పెళ్లి కావడం.. తమ ఇంట కొత్తల్లుడు రావడమే. తొలిరోజు భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ.. సంక్రాంతి,కనుమ పండుగల్ని కూడా అదే రేంజ్‌లో జరుపుకుంది. ఇది మెగాస్టార్ ఇంట జరిగిన సంక్రాంతి పండగ కనుక మర్యాదలు కూడా మెగా రేంజులోనే వున్నాయి. ఈ మధ్య చీరంజీవి అంటే ఎక్కువ మంది దోశెలు గుర్తు చేసుకుంటున్నారు. లాక్ డౌన్‌లో ఆయన దోసెలు వేయడం.. అలాగే.. అహా షోలో.. కళ్లకు గంతలు కట్టుకుని దోసెలు వేయడం బాగా పాపులర్ అయిపోయాయి. అందుకే.. భోగిమంటల సమయంలోనూ దోశెల హడావుడి కనిపించింది.

చిరంజీవి కుటుంబసభ్యులు చిన్నా పెద్దా.. అందరూ పాల్గొన్నారు. ఇక మెగా ఇంటి ఆడపడచులు, కోడళ్లతో ప్రత్యేకంగా ఫోటో సెషన్ పెట్టించారు. తన సోదరిమణులతో చెర్రీ దిగిన ఫోటో బాగా ఆకర్షిస్తోంది. సంక్రాంతి రోజు రాత్రి మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఈ మ్యూజికల్ నైట్ ఎంతో సందడిగా సాగింది. అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close