క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా తర్వాత ప్రేక్షకులని థియేటర్లకి రప్పించిన సినిమాగా నిలిచిన ‘క్రాక్’ మాస్ విజయంపై దర్శకుడు గోపీచంద్ మలినేని మనసులోని మాటలు…

* సంక్రాంతి విజేత అంటే ప్రేక్షకులు క్రాక్ పేరు చెబుతున్నారు. పెద్ద పండగ. పైగా కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన హిట్ క్రాక్ రూపంలో వచ్చింది. ఎలా అనిపిస్తుంది ?

– వెరీ హ్యాపీ. దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు తెరచుకోలేదు. అందరిలో ఓ భయం వుండిపోయింది. థియేటర్లు ఓపెన్ అవుతాయా ? అయితే జనం వస్తారా ? ఒకవైపు ఒటీటీ అంటున్నారు. ఇలా బోలెడు భయాలు, అనుమానాలు. కానీ నాకు మొదటి నుండి ఓ నమ్మకం వుంది. ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఓ మంచి మాస్ సినిమాతో వస్తామనే గట్టి నమ్మకంతో వున్నా. మధ్యలో ఒటీటీ ఆఫర్లు వచ్చినా.. వద్దు అనుకున్నా. ఇది థియేటర్ సినిమా అని గట్టిగా నిలబడ్డా. థియేటర్లో కి ఖచ్చితంగా జనాలు వస్తారని అనుకున్నాం. సర్ప్రైజ్ ఏమిటంటే మేము ఆనుకున్న దాని కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారు. వస్తున్నారు. ఇంకా షాకింగ్ ఏమిటంటే.. మా సినిమా కొంచెం ఆలస్యం అయ్యింది. కానీ ప్రేక్షకులు థియేటర్ దగ్గర ఎదురుచూడటం చూశాం. నిజంగా వాళ్ళందరికీ నమస్కారిస్తున్నా. తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవారో మరోసారి రుజువైయింది.

* 9వ తేదీన సినిమా రాలేదు. జనాలు థియేటర్ బయట వున్నారు. ఒక దర్శకుడిగా ఆ రోజు మీ పరిస్థితి ఏంటి ? టెన్షన్ పడ్డారా ?

– మాటల్లో చెప్పలేను. ఆ టెన్షన్ గురించి చెప్పడానికి మాటలు వెతుక్కోవాలి. ఏ దర్శకుడికి ఆ పరిస్థితి రాకూడదు. ప్రాణం పెట్టి పని చేశాం. బోలెడు నమ్మకం పెట్టుకున్నాం. సరిగ్గా విడుదల సమయంలో ఇలాంటి అవాంతరం ఎందుకు వచ్చింది ? ఎప్పుడు ఇది క్లియర్ అవుతుందని ప్రతి సెకన్ ఆందోళనతో గడిపా. ఎక్కడ నిలుచుంటున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో అర్ధం కాలేదు. అయితే చివరికి ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ తో టెన్షన్ మొత్తం ఒక్క సెకన్ లో ఎగిరిపోయింది.

* మాస్ సినిమా బలం క్రాక్ తో మరోసారి రుజువైయిందా ? ఇండస్ట్రీ నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటి ?

– చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలోని దర్శకులంతా ఫోన్ చేశారు. త్రివిక్రమ్, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పూరి, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి.. ఇలా పేర్లు చెబితే చాలా పెద్ద లిస్టు అవుతుంది. వీళ్ళంతా చెప్పింది ఒక్కటే. ‘మంచి మాస్ సినిమా పడితే ఎలాంటి పరిస్థితి వున్నా ప్రేక్షకులు థియేటర్లోకి వస్తారని రుజువు చేశావ్. పరిశ్రమకి ధైర్యం ఇచ్చిన సినిమా” అన్నారు. ఈ మాటలు చాలా కిక్ ఇచ్చాయి.

* రవితేజ మాస్ హీరో. కానీ ఈసారి మాస్ ఎలిమెంట్స్ ని డబల్ ధమాకా లో చూపించారు? స్పెషల్ గా ఎలివేషన్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీని వెనుక ఎలాంటి వర్క్ చేశారు?

– మంచి పాయింట్ అడిగారు. డాన్ శీను చేసిన తర్వాత కామెడీ స్టాంప్ నాపై పడింది. ఏదో ఎంటర్ట్రైన్మెంట్ తో కామెడీ చేస్తాడని చాలా మంది అనుకున్నారు. కాదు.. మాస్ సినిమా కూడా తీయగలనని నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నంలో చేసిన సినిమా ఇది. చాలా వర్క్ చేశాను. నేను చిన్నప్పుడు నుండి ఒంగోల్లో విన్న ఇన్సిడెంట్స్ డీటేయిలింగ్ లోకి వెళ్ళా. దానిపై బాగా వర్క్ చేశా. చాలా మందిని కలిసా. ఈ రోజు సినిమాలోని ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నారంటే కారణం.. వాటిపై స్పెషల్ గా వర్క్ చేయడమే.

* కధ రాసుకున్నప్పుడే.. మావిడి పండు , పచ్చ నోటు, మేకు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయా ?

– కధలో అన్నీ వున్నాయి. కధ రాసుకున్నప్పుడే ఆ ఎలిమెంట్స్ తో రాసుకున్న. మూడు ఎలిమెంట్స్.. ముగ్గురు జీవితాలు.. ఇలా ముడివేసుకొని కధ చెప్పాలని ముందే నిర్ణయించుకున్నా. మీరు గమనిస్తే ఒక పాత్ర మరో పాత్రని పరిచయం చేస్తుంది. విలన్ హీరోని పరిచయం చేస్తాడు. ఫ్రెష్ గా వుంటుందని స్క్రిప్ట్ లో మొదటి పేజీ రాస్తున్నప్పుడే డిజైన్ చేసుకున్నా.

* క్రాక్ 2 ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు ? ఎప్పుడు చూపిస్తారు ?

– క్రాక్ కి ఆ పవర్ వుంది. క్రాక్ 2 కచ్చితంగా వుంటుంది. అన్ని కుదిరినప్పుడు తప్పకుండా వస్తుంది.

* ఈ సినిమాతో మీకు బోనస్ పుత్రోత్సాహం. అసలు మీ అబ్బాయిలో ఆ ట్యాలెంట్ వుందని ఎప్పుడు గ్రహించారు. ?

– వాడు హైపర్ యాక్టివ్. చాలా అల్లరి కూడా. ఈ సినిమా కోసం వేరే పిల్లల్ని చూశాను. కానీ ఎవరిపైనా గురి కుదరలేదు. మావాడైతే ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చింది. దీనికి ఓ కారణం కూడా వుంది. నేను, రవితేజ ఒకేలా వుంటామని చాలామంది అంటారు. చాలా పోలికలు కలుస్తాయి. మా అబ్బాయిని పెడితే రవితేజ కొడుకు అంటే నేచురల్ గా ఉంటుందని( నవ్వుతూ )వాడిని పిక్ చేశా. చాలా బాగా చేశాడు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడి గురించి నేను పెద్దగా కష్టపడలేదు.

* లాక్ డౌన్ తర్వాత కూడా షూట్ చేశారు. ఈ విరామంలో కధలో ఏమైనా మార్పులు చేశారా ?

– లేదు. ఏం మార్చలేదు. మూడు పాటలు మిగిలాయి. మూడు రోజులు చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్. అవి తప్పితే కొత్తగా ఏం తీయలేదు. మార్పులు చేయలేదు.

* దర్శకుడు, రచయిత బివిఎస్ రవిని తీసుకోవడానికి కారణం ?

– రవిని నేను అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్నప్పటి నుండి చూస్తున్నా. అతని టైమింగ్ భలే వుంటుంది. ప్రతి మాటలో చిన్న వెటకారం వుంటుంది. అది నాకు చాలా ఇష్టం. అది వాడుదాం అనుకున్న. పల్లెటూర్లో పెరిగారు. అక్కడ టీ కొట్టు దగ్గర కూర్చుని గాలి కబుర్లు చెబుతారు. మాఊరిలో యలమంద అనే ఓ క్యారెక్టర్ వుండేది. రవికి కూడా అదే పేరు పెట్టా. యాక్టింగ్ అంటే రవి వద్దు అన్నాడు. నేనే పట్టుబట్టి చేయించా.

* కధ చెప్పినప్పుడు శ్రుతిహాసన్ రియాక్షన్ ?

– శ్రుతితో బలుపు చేశా. మళ్ళీ రవితేజ, నేనే డైరెక్టర్ అనే అలాంటి కామెడీ ఏదో చేయిస్తారని అనుకొని చాలా రిలాక్స్ గా వింది. మీకో కొడుకు ఉంటాడని చెప్పా. షాక్ అయ్యింది. ఏదో చెప్పి పంపించేయాలనే మూడ్ ఆమెలో కనిపించింది. చివరికి ఆ బ్లాక్ చెబితే చాలా సర్ప్రైజ్ అయ్యింది. ఈ రోజు థియేటర్ లో ప్రేక్షకులు ఎలా థ్రిల్ అవుతున్నారో కధ చెప్పినప్పుడు ఆ థ్రిల్ ని శ్రుతిలో చూశా.

* రవితేజ బాడీ లాంగ్వేజ్ ని భలే పట్టేశారు ? ఎలా సాధ్యపడింది ?

– బేసిగ్గా నేను రవితేజకి ఫ్యాన్ ని. రవితేజ డైలాగ్, యాక్షన్.. నాకు చాలా ఇష్టం. వాటిని ఇంకా ఎలివేట్ చేయాలనే చూస్తుంటాను.

* మీ తర్వాత సినిమా కూడా ఇంత భారీగా వుంటుందా ?

– 100%. తర్వాత సినిమా కూడా చాలా భారీ ఉండబోతుంది. ఈ లాక్ డౌన్ లో చాలా మంచి స్క్రిప్ట్ రాసుకున్నా. హై వోల్టేజ్ లో వుంటుంది. చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో అన్నది త్వరలోనే చెబుతా.

* అల్ ది బెస్ట్..

– థాంక్యూ …

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

HOT NEWS

[X] Close
[X] Close