రమేష్‌కుమార్ లేఖ ఫేక్ కాదు రియల్..! హోంశాఖ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి లేఖ అందింది.. కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. మీడియాలో వచ్చిన వార్తలతో.. దీనిపై సమాచారం చెప్పాలంటూ.. గుడిపాటి నీరజ్ కుమార్ అనే వ్యక్తి.. సమాచార హక్కు చట్టం కింద…దరఖాస్తు చేసుకున్నారు. దానికి స్పందించిన కేంద్ర హోంశాఖ.. వెంటనే రిప్లయి ఇచ్చింది. భద్రత కోసం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి లేఖ వచ్చిందని.. దాన్ని తదుపరి చర్యల కోసం ఫార్వార్డ్ చేశామని స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశాన్ని తాము పోస్టు ద్వారా పంపుతామని.. నీరజ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ తెలిపింది. దీంతో.. ఈసీ రాసినలేఖ ఫేక్ అంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అబద్దమని తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీఎస్‌ఈసీ …నిమ్మగడ్డ రమేష్ కమార్.. ఆరు పేజీలతో ఏపీలో ఎన్నికలు జరిగిన విధానాన్ని.. అధికార యంత్రాంగం.. నిర్లిప్తంగా ఉన్న వైనం.. పాలకుల కక్ష సాధింపు చర్యలు.. తనపై జరిగుతున్న వ్యక్తిగత దాడుల అంశాలన్నిటినీ వివరిస్తూ.. ఓ ఆరు పేజీల లేఖను.. కేంద్ర హోంశాఖరు రాసినట్లుగా బుధవారం సాయంత్రం నుంచి మీడియాలో ప్రచారం అయింది. అయితే.. తర్వాత కొన్ని మీడియా చానళ్లు.. అలా తాను లేఖ రాయలేదని.. రమేష్ కుమార్ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

తాను రాశానని కానీ.. రాయలేదని కానీ ఆయన చెప్పలేదు. దీంతో అదో రాజకీయ ఇష్యూ అయిపోయింది. అయితే ఈ క్రమంలో… సీఆర్పీఎఫ్ బలగాలు.. ఎస్‌ఈసీకి రక్షణ కల్పించడానికి వచ్చాయి. దీంతో కేంద్రానికి లేఖ అందిన మాట నిజమేనని.. తేలింది. ఇప్పుడు.. నీరజ్ కుమార్ అనే వ్యక్తికి ఆర్టీఐలో దాన్ని అధికారికంగా చెప్పినట్లయింది. ఇప్పుడు ఈ లేఖ పరిణామాలు ఎలా ఉంటాయో.. అన్నదే కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close