అమేథీలో రాహుల్ గాంధీకి సవాల్ !

కంటికి కనిపించేది ఒకటి. కనపడని వాస్తవం మరొకటి. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ వైరంలోనూ ఈ వాస్తవం దాగి ఉంది. కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీలైనప్పుడల్లా భీకరంగా మొదట విరుచుకు పడేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై. ఆ తర్వాత ఆయన అటాక్ టార్గెట్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తాను రాహుల్ పై అమేథీలో పోటీ చేశాను కాబట్టే కాంగ్రెస్ వాళ్లు టార్గెట్ చేశారనే స్మృతి ఇరానీ మాటలో వాస్తవం ఉందనే సంఘటనలు చాలా ఉన్నాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో, ఆ తర్వాత జెఎన్ యు వివాదంలో స్మృతి ఇరానీని ఇరుకున పెట్టడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. రోహిత్ ఆత్మహత్య వార్త ఇంకా తెలంగాణలోనే చాలా మందికి తెలియని పరిస్థితుల్లో, ఆయన ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో హైదరాబాదులో వాలిపోయారు. స్మృతిపై దుమ్మెత్తి పోశారు.

ఈ యుద్ధానికి అసలైన వేదిక అమేథీ. అక్కడ 2014 ఎన్నికల్లో రాహుల్ కు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న చోటే కష్టపడి గెలవాల్సిన పరిస్థితి ఆయనకు కల్పించారు. మోడీ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత కూడా ఆమె తరచూ అమేథీలో పర్యటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో అమేథీలో పాగా వేయాలని, రాహుల్ ను ఓడించాలని స్కెచ్ వేశారు. ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దాదాపు ప్రతి వారాంతం అమేథీ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామస్థాయికి మించి బూత్ స్థాయి వరకూ బీజేపీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం జరుగుతోందని ఆమె బహిరంగంగానే కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.

గత రెండేళ్లలో అమేథీలో ఆమె రాహుల్ కంటే ఎక్కువ సార్లు పర్యటించారనేది బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొన్ని పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం జరుగుతోంది. అమేథీ అభివృద్ధిలో చాలా వెనకబడిందని, రాహుల్ ఏమాత్రం బాగు చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు.
ఆయన ఒక విఫల ఎంపీ అని ముద్ర వేయడానికి ప్రయత్నం జరుగుతోంది. నెహ్రూ గాంధీ కుటుంబ కంచు కోటను బద్దలు కొట్టడం మామూలు విషయం కాదు. అయినా ఈ లక్ష్యం సాధిస్తానని ఆమె ధీమాతో ఉన్నారు.

అమేథీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 1977లో ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవ లేదు. 1980 ఎన్నికల్లో మాత్రం సంజయ్ విజయం సాధించారు. అయితే ఆయన విమాన ప్రమాదంలో మరణించడంతో 1981లో ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ గెలిచారు. అలా వరసగా నాలుగు సార్లు రాజీవ్ విజయం సాధించారు.

అమేథీలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది 1998లో. వాజ్ పేయి హవాలో అక్కడ కమలం వికసించింది. అయితే, 1999లో మాత్రం సోనియా గాంధీ విజయం సాధించారు. తర్వాత 2004 నుంచి వరసగా మూడు సార్లు రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 1998ని రిపీట్ చేస్తానంటున్నారు స్మృతి ఇరానీ. సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు గుడ్డిగా రాహుల్ కు ఓటేసే రోజులు పోయాయని, ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓటేస్తారని స్మృతి భావిస్తున్నారు. పైగా పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. అందుకే, ఆమెను ఓ విఫల మంత్రిగా చిత్రించడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారనేది బీజేపీ ఆరోపణ. నిజంగానే ఆమెకు రాహుల్ గాంధీ భయపడుతున్నారా అంటే అదేం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అమేథీ కాంగ్రెస్ కంచు కోట అని డంకా బజాయించి చెప్తున్నారు. అయితే, రేపటి విజయానికి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటాననే స్మృతి ఇరానీ ప్లానింగ్ మాత్రం కాంగ్రెస్ వారిని ఆలోచింప చేస్తున్నట్టుంది. చివరకు 2019లో ఏం జరుగుతుందో గానీ, ఈ మూడేళ్లూ ఢిల్లీ వేదికగా ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఇంకెంతటి యుద్ధం జరుగుతుందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close