ఈవీఎంల మొరాయింపు, దాడులు అన్నీ ప్రణాళిక ప్రకారమే చేశారంటున్న చంద్రబాబు

ఈవీఎంలు ఓ ప్రణాళిక ప్రకారం.. పని చేయకుండా చేసి… ప్రీలోడెడ్ ఈవీఎంలతో రీప్లేస్ చేశారని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం… ఎప్పుడూ లేనంతగా ఏకంగా 31శాతం ఈవీఎంలు పని చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సాక్షాత్తూ ద్వివేదీనే…. ఓటు వేయలేకపోయారని… గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు ఈవీఎంలను రీప్లేస్ చేశారన్నారు. ప్రజల భవిష్యత్ ను.. మెషిన్‌కు వదిలేశారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని బీజేపీ బ్రాంచ్ ఆఫీసుగా మార్చారని మండిపడ్డారు. పోలింగ్ కు ఇరవైనాలుగు గంటల ముందు కూడా.. అధికారుల్ని బదిలీ చేసి.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామని… సూచనలు పంపారని.. దానికి తగ్గట్లుగానే.. వ్యవహారాలు జరిగాయన్నారు. ఇంత పనికి మాలిన ఈసీని తన జీవితంలో చూడలేదన్నారు.

ఢిల్లీలో బీజేపీ, ఇక్కడ వైసీపీ ఏది చేస్తే అదే చేశారని… మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో రౌడీయిజనమేదే కనిపించలేదని.. ఈ సారి … రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని అడిగితే.. ఆరు రోజుల సమయం పడుతుందని… ఈసీ కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తోందని.. గతంలో ఒక్క రోజులోనే కౌంటింగ్ పూర్తయ్యేది కాదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయంపై తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇంత జరిగిన తర్వాత ఈవీఎంలపై ఎవరికైనా నమ్మకం ఉంటుందా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణంగా.. . ఎన్నికల నిర్వహణ ఉంటే.. వైసీపీ నేతలు మాత్రం.. ఈసీని ఎందుకు పొగుడుతున్నారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రకియ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీ వ్యవహరించిన తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలనుకున్నప్పుడు.. ముఖ్యమంత్రితో సంప్రదించరా.. అని ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ చీఫ్ ను తప్పిస్తే… భద్రత విషయంలో తలెత్తే అనుమానాలు ఎవరు తీరుస్తారని మండిపడ్డారు. మోడీకి, కేసీఆర్ కు భయపడి ఉంటే.. రాష్ట్రాభివృద్ధి జరిగేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు ఓట్లు వేయకుండా… మోడీ , కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారని.. అయినప్పటికీ.. ప్రజలు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. ఎక్కడైనా పోలింగ్ … మందకొండిగా ప్రారంభమై ఉధ్ధృతం అవుతుందని … కానీ ఏపీలో మాత్రం ఉదయం నుంచి జనం బారులు తీరారన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఏపీకి.. ఓట్లు వేయడానికి వచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close