చంద్రబాబు..నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తెలుగు రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన అనుభవం..ఇలా పొలిటికల్ హిస్టరీలో ఆయన పేరిట చాలా ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. అలాంటి చంద్రబాబు ముందు అధికారం ఉందని నాడు పిల్ల గెంతులు వేసిన వైసీపీ ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.
ఎస్.. చంద్రబాబు కొట్టే దెబ్బకు వైసీపీ వేగంగా పతనం అంచునకు చేరుకుంటుంది. ఎన్నికలు ముగిశాక కూడా వైసీపీ పతనం కొనసాగుతోంది. తాజాగా ఒకే దెబ్బకు వైసీపీలో మూడు వికెట్లు డౌన్. కడప , చీరాల, మాచర్లలో ఫ్యాన్ పంకాలు విరగ్గోటేశారు. జగన్ రెడ్డికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు.
జగన్ లా అక్రమపద్ధతిలో భయపెట్టించో, డబ్బు ఆశ చూపించో కాదు.. చట్టంపరిధిలో వైసీపీకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు. అవినీతి, అవిశ్వాసం, దుర్వినియోగం ఆరోపణలతో ముగ్గురు పదవులను కోల్పోయారు. కడప మేయర్ సురేశ్ బాబుకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలతో ఆయనపై వేటు పడింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని విచారణలో తేలడంతో ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం .
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ పైనా కూడా వేటుపడింది. పదవిని దుర్వినియోగం చేయడం , పురపాలక చట్టాలను ఉల్లంఘించడంతో ఆయనకు ఉద్వాసన పలికారు. ఎలాంటి అనుమతి లేకుండా వరుసగా 15సార్లు కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో సెక్షన్ 16(1)ప్రకారం ఆయనను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు.
ఇక చీరాలలోనూ వైసీపీ ఇదే ట్రీట్మెంట్ అనుభవించింది. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అలాగే వైస్ చైర్మన్ జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27మంది ఓటు వేశారు. దీంతో త్వరలోనే కొత్త చైర్మన్ ఎన్నిక జరగనుంది. అది కూటమి ఖాతాలో పడటం ఖాయం.