ఆ పార్టీలను బుజ్జ‌గించ‌డంలో చంద్ర‌బాబుదే కీల‌క బాధ్య‌త‌

కేంద్రంలో భాజ‌పా స‌ర్కారుకు వ్య‌తిరేకంగా మ‌హా కూట‌మి ఏర్పాటుకు మ‌రో ముంద‌డుగు ప‌డుతోంది. ఈ నెల పంతొమ్మిదిన కోల్ క‌తాలో జ‌రుగుతున్న మ‌హాధ‌ర్నాకు భాజ‌పా వ్య‌తిరేక‌ పార్టీల‌న్నీ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ సంద‌ర్భంగా కూట‌మి ఏర్పాటుకు అక్క‌డే కీల‌క‌మైన నిర్ణ‌యం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇదే అంశ‌మై చ‌ర్చించేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఏడు గంట‌ల‌కు ఢిల్లీ చేరుకున్న చంద్ర‌బాబు… ముందుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో గంట సేపు చ‌ర్చించారు. ఆ త‌రువాత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, ఫ‌రూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ మీటింగుల‌న్నీ ముగించుకుని తిరిగి రాత్రి 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు.

కోల్ క‌తాలో జ‌రిగే ర్యాలీకి మ‌మ‌తా బెన‌ర్జీ ఆహ్వానించార‌నీ, అదే విష‌య‌మై శ‌ర‌ద్ ప‌వార్ తో చ‌ర్చించేందుకు ఢిల్లీకి వ‌చ్చాన‌న్నారు చంద్ర‌బాబు. కోల్ క‌తాకి భాజ‌పాయేత‌ర పార్టీల‌న్నీ వ‌స్తాయ‌నీ, ఆరోజున మ‌హా కూట‌మి భ‌విష్య‌త్తుపై కీల‌క నిర్ణ‌యాలు చ‌ర్చించి తీసుకుంటామ‌న్నారు. ర్యాలీకి ఏయే పార్టీలు హాజ‌రౌతాయ‌నేది కూడా రెండ్రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇత‌ర పార్టీల‌తో కొన్ని ఇబ్బందులున్న‌ప్ప‌టికీ, దేశం కోసం అంద‌రూ చేతులు క‌ల‌పాల్సిన సంద‌ర్భం ఇది అన్నారు. భాజ‌పా వ్య‌తిరేక వేదిక‌పైకి అంద‌ర్నీ తీసుకొచ్చే బాధ్య‌త సీనియ‌ర్లుగా త‌మ‌పైన ఉంద‌న్నారు.

నిజానికి, ఆ బాధ్య‌త చంద్ర‌బాబు నాయుడే తీసుకున్నారు అని చెప్పాలి. ఉత్త‌రప్ర‌దేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు సొంతంగా సీట్ల స‌ర్దుబాట్లు చేసేసుకున్నాయి. కాంగ్రెస్ ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. మ‌రికొన్ని పార్టీలు కూడా సొంతంగా ఎన్నిక‌ల బ‌రిలోకి సిద్ధ‌మ‌న్న‌ట్టు త‌యారౌతున్నాయి. భాజ‌పాయేత‌ర కూట‌మిలో కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డంపై కాస్త ఆలోచిస్తున్న పార్టీలూ ఉన్నాయి. వీట‌న్నింటినీ ఒప్పించాల్సిన బాధ్య‌త‌ను చంద్ర‌బాబు త‌న‌పై వేసుకున్నారు. నేతలంద‌రితోనూ తానే స్వ‌యంగా మాట్లాడ‌తాన‌ని అంటున్నారు. వాస్త‌వానికి, భాజపాకి వ్య‌తిరేకంగా తామూ పోరాడ‌తాం అని చెప్తున్న పార్టీలైతే ఉన్నాయిగానీ… పోరాడేవారంద‌రినీ ఒక ద‌గ్గ‌ర‌కి చేర్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది టీడీపీ మాత్ర‌మే. పంతొమ్మిదిన జ‌రిగే భేటీలో కూడా చంద్ర‌బాబు నాయుడు కీల‌కపాత్ర పోషించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close